Nivetha Thomas: చూస్తున్నకొద్దీ చూడాలనిపించే అందం.. నివేదా థామస్..
Nivetha Thomas: నివేదా థామస్.. ఈ పేరు గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. యావరేజ్ హైట్ కానీ సూపర్ క్యూట్.;
Nivetha Thomas (tv5news.in)
Nivetha Thomas: నివేదా థామస్.. ఈ పేరు గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. యావరేజ్ హైట్ కానీ సూపర్ క్యూట్. నవ్వితే ఆ సొట్ట బుగ్గలకు కుర్రకారు హార్ట్ బీట్ ఒక్కసారిగా మిస్ అవ్వాల్సిందే. ఈ ముద్దుగుమ్మ చీరకట్టినా అందమే.. జీన్స్ వేసిన అందమే.. ఇప్పటికీ ఎందరో మలయాళ ముద్దుగుమ్మలు టాలీవుడ్‌లోనే కాదు.. తెలుగువారి మనసులలో కూడా సెటిల్ అయిపోయారు. వారందరిలో నివేదా ప్రథమ స్థానంలో ఉంటుంది. అలాంటి మలయాళ ముద్దుగుమ్మ పుట్టినరోజు ఈరోజు..
తమిళ, మలయాళంలో చైల్డ్ ఆర్టిస్ట్‌గానే తన కెరీర్‌ను ప్రారంభించింది నివేదా థామస్.
ఆ తర్వాత అక్కడే జూనియర్ ఆర్టిస్ట్‌గా సెటిల్ అయిపోయింది. విజయ్, కమల్ హాసన్ లాంటి స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది నివేదా.
నేచురల్ స్టార్ నాని నటించిన 'జెంటిల్‌మెన్' సినిమాలో హీరోయిన్‌గా నటించి తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యింది నివేదా థామస్.
'జెంటిల్‌మెన్' లాంటి థ్రిల్లర్ సినిమాలో తనదైన నటనతో ఆకట్టుకున్న నివేదా.. రెండో సినిమాకు కూడా నానితోనే జతకట్టింది.
లైట్ అయిన పర్వాలేదు కంటెంట్ ఉన్న సినిమాలే ఎంచుకోవాలి అనుకున్న నివేదా కెరీర్ స్లో అయినా కూడా తను కంగారుపడలేదు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన 'వకీల్ సాబ్'లో ఓ కీలక పాత్ర చేసిన నివేదా.. ఇందులో తన యాక్టింగ్‌తో ప్రేక్షకులను మరోసారి ఫిదా చేసింది.
ప్రస్తుతం నాని నిర్మాతగా తెరకెక్కుతున్న 'మీట్ క్యూట్'లో నటిస్తోంది నివేదా.