Payal Rajput: బోల్డ్ అండ్ బ్యూటీఫుల్ పాయల్ రాజ్‌‌పుత్ బర్త్‌డే స్పెషల్.. క్యూట్ ఫోటోస్..

Payal Rajput: పాయల్ రాజ్‌పుత్.. ప్రస్తుతం టాలీవుడ్‌లో బోల్డ్ అండ్ బ్యూటీఫుల్ హీరోయిన్స్‌లో తను కూడా ఒకరు.;

Update: 2021-12-05 16:29 GMT

Payal Rajput (tv5news.in)

Payal Rajput: పాయల్ రాజ్‌పుత్.. ప్రస్తుతం టాలీవుడ్‌లో బోల్డ్ అండ్ బ్యూటీఫుల్ హీరోయిన్స్‌లో తను కూడా ఒకరు. ఒక బోల్డ్ మూవీతో హీరోయిన్‌లాగా ఎంట్రీ ఇచ్చిన పాయల్ ఇప్పటికీ అదే ఇమేజ్‌ను మెయింటేయిన్ చేస్తూ వస్తోంది. అలాంటి బోల్డ్ హీరోయిన్ పుట్టినరోజు నేడు.


'ఆర్ ఎక్స్ 100'తో తెలుగులో హీరోయిన్‌గా పరిచయమయ్యింది పంజాబీ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్.


'ఆర్ ఎక్స్ 100' కంటే ముందు తాను ఒక పంజాబీ చిత్రం, ఒక హిందీ చిత్రంలో నటించింది.


పుల్కి్త్ సామ్రాట్ హీరోగా తెరకెక్కిన 'వీరే కీ వెడ్డింగ్' అనే హిందీ చిత్రంలో ఒక చిన్న పాత్ర చేసి బాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమయ్యింది పాయల్.


'ఆర్ ఎక్స్ 100' బ్లాక్ బస్టర్ హిట్ అయినా కూడా పాయల్‌కు తెలుగులో వెంటవెంటనే అవకాశాలు దక్కలేదు.


కెరీర్ బిగినింగ్‌లోనే తేజ దర్శకత్వంలో కాజల్ హీరోయిన్‌గా తెరకెక్కిన 'సీత' చిత్రంలో స్పెషల్ సాంగ్ చేసి అందరికీ షాక్ ఇచ్చింది పాయల్.


వెండితెరపై అవకాశాలు కరువయినా.. ఓటీటీలో పాయల్ లైఫ్ సాఫీగా సాగిపోతోంది.


ఆహాలో పాయల్ చేసిన '3 రోజెజ్' వెబ్ సిరీస్ ఇప్పటికే పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది.


వెబ్ సిరీస్‌లలో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేసిన పాయల్.. ఇలాగే మరికొన్ని సిరీస్‌లతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది.





Tags:    

Similar News