ప్రగతిభవన్‌లో ఘనంగా రాఖీ వేడుకలు.. అక్కల ఆశీస్సులు తీసుకున్న సీఎం కేసీఆర్..!
తెలంగాణ సీఎం కేసీఆర్ అధికారిక నివాసం ప్రగతిభవన్‌లో రాఖీ వేడుకలు ఘనంగా జరిగాయి.;
తెలంగాణ సీఎం కేసీఆర్ అధికారిక నివాసం ప్రగతిభవన్‌లో రాఖీ వేడుకలు ఘనంగా జరిగాయి. సీఎంకు తమ సోదరీమణులు లక్ష్మమ్మ, జయమ్మ, లలితమ్మలు రాఖీలు కట్టి ఆశీర్వదించారు. రాఖీ ఉత్సవాలతో కేసీఆర్ ఇంట్లో సందడి నెలకొంది. ఈ వేడుకల్లో సీఎం సతీమణి శోభమ్మ, మంత్రి కేటీఆర్, శైలిమ దంపతులు, ఎంపీ సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.