Ritu Varma: రీతూ వర్మ కొత్త స్టైల్.. శారీలో స్పైసీ లుక్స్‌తో..
Ritu Varma: తెలుగు సినీ పరిశ్రమలో తెలుగు హీరోయిన్లు చాలా తక్కువ.;
Ritu Varma (tv5news.in)
Ritu Varma: తెలుగు సినీ పరిశ్రమలో తెలుగు హీరోయిన్లు చాలా తక్కువ. పరభాష హీరోయిన్లే ఇక్కడ ఎక్కువగా హవా సాగిస్తుంటారు. కానీ ఇక్కడ ఉన్న అరాకొరా తెలుగమ్మాయిలు కూడా తమ మార్క్‌ను బాగానే క్రియేట్ చేశారు. అందులో ఒకరు రీతూ వర్మ.
షార్ట్ ఫిల్మ్స్‌తో తన కెరీర్‌ను ప్రారంభించి ఇప్పుడు ఫీచర్ ఫిల్మ్స్‌లో బిజీ యాక్ట్రెస్‌గా మారిపోయింది రీతూ వర్మ.
తొలిచిత్రం 'పెళ్లిచూపులు'తోనే అందరినీ ఇంప్రెస్ చేసిన రీతూ వర్మ.. స్క్రిప్ట్ సెలక్షన్‌లో కాస్త ఆలోచించి అడుగులేస్తుంది.
తెలుగులోనే కాదు తమిళంలో కూడా తాను నటించిన తొలి చిత్రం 'కన్నుమ్ కన్నుమ్ కొల్లయాడితిల్' రీతూ వర్మకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. అంతే కాకుండా బెస్ట్ డెబ్యూ యాక్ట్రెస్‌గా అవార్డును కూడా సొంతం చేసుకుంది.
సినిమాల నుండి కాస్త గ్యాప్ తీసుకున్న రీతూ.. ఇప్పుడు ఆ గ్యాప్‌ను ఫిల్ చేస్తూ వెళ్తోంది. వరుసగా యంగ్ హీరోల సినిమాలలో నటిస్తూ బిజీగా గడిపేస్తోంది.
తెలుగులోనే కాదు తమిళంలో కూడా రీతు వర్మకు ప్రస్తుతం చేతినిండా ఆఫర్లు ఉన్నాయి.
ఎప్పుడూ ఫ్యాషన్ ఫోటోషూట్‌తో తన ఫ్యాన్స్‌ను ఇంప్రెస్ చేసే రీతూ.. తాజాగా జరిగిన తన సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బ్లూ సారీలో చాలా అందంగా కనిపించి మరోసారి అందరినీ ఫిదా చేసింది.