Saanve Megghana: బన్నీకి పబ్లిక్‌గా ప్రపోజ్ చేసిన అమ్మాయి ఈమే..
Saanve Megghana: టాలీవుడ్‌లోకి తరచుగా ఎంతోమంది అమ్మాయిలు హీరోయిన్లుగా అడుగుపెడుతూనే ఉన్నారు.;
Saanve Megghana (tv5news.in)
Saanve Megghana: టాలీవుడ్‌లోకి తరచుగా ఎంతోమంది అమ్మాయిలు హీరోయిన్లుగా అడుగుపెడుతూనే ఉన్నారు. కానీ అందులో కొందరు మాత్రమే స్క్రీన్‌పై తమ ఛార్మ్‌తో మెప్పించి మరికొన్ని అవకాశాలు దక్కించుకోగలుగుతున్నారు. అలా తన గ్రేస్‌తో అలరించడానికి సిద్దమయిన ముద్దుగుమ్మ శాన్వీ మేఘన. ఇప్పటివరకు సినిమాల్లోని చిన్న చిన్న క్యారెక్టర్లలో, వెబ్ సిరీస్‌లలో నటించి మెప్పించిన శాన్వీ మేఘన మొదటిసారి లీడ్ రోల్‌తో పరిచయం కానుంది.
శాన్వి మేఘన హీరోయిన్‌గా నటిస్తున్న 'పుష్పక విమానం' నవంబర్ 2న విడుదలకు సిద్ధమయ్యింది. ఈ సందర్భంగా మూవీ టీమ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఏర్పాటు చేసింది. ఈ ఈవెంట్‌కు విజయ్ దేవరకొండ, అల్లు అర్జున్ ఛీఫ్ గెస్ట్‌లుగా హాజరయ్యారు. అల్లు అర్జున్‌ను చూసిన శాన్వి.. తాను బన్నీకి పెద్ద ఫ్యాన్ అంటూ స్టేజ్ మీదే ప్రపోజ్ చేసింది. అంతే కాకుండా బన్నీని హగ్ చేసుకొని ఎంతో మురిసిపోయింది. దీంతో ఒక్కసారిగా ప్రేక్షకుల చూపు తనపై పడింది.