Shalini Pandey: పూర్తిగా లుక్ మార్చేసిన 'అర్జున్ రెడ్డి' భామ.. బాలీవుడ్‌పైనే ఫోకస్..
Shalini Pandey: ఒకప్పుడు బొద్దుగా ఉండే షాలినీ.. పూర్తిగా తన లుక్‌ను మార్చేసింది. ఇక బాలీవుడ్‌లోనే సెటిల్ అయిపోతోంది.;
Shalini Pandey: 'అర్జున్ రెడ్డి' అనే ఒక్క సినిమా టాలీవుడ్‌లో పెద్ద సంచలనాన్నే సృష్టించింది. ఈ సినిమా వల్ల విజయ్ దేవరకొండకు ఎంత పేరొచ్చిందో.. దీని ద్వారా హీరోయిన్‌గా పరిచయమయిన షాలిని పాండేకు కూడా అంతే పేరొచ్చింది. ప్రస్తుతం ఈ భామ టాలీవుడ్‌ను వదిలేసి పూర్తిగా బాలీవుడ్‌పైనే ఫోకస్ పెట్టింది.
చాలామంది టాలీవుడ్ ప్రేక్షకులకు నచ్చిన క్యారెక్టర్ 'అర్జున్ రెడ్డి'లో ప్రీతి శెట్టి. ఆ పాత్రలో షాలినిని తప్ప ఎవ్వరినీ ఊహించుకోలేమేమో అన్నట్టుగా ఉంటుంది మూవీలో తన పర్ఫార్మెన్స్.
కానీ షాలిని పాండే కెరీర్‌లో చెప్పుకునే బ్లాక్ బస్టర్ హిట్ అర్జున్ రెడ్డి మాత్రమే. ఆ తర్వాత తన కెరీర్ పూర్తిగా స్లో అయిపోయింది.
డెబ్యూ హిట్‌తో వచ్చిన క్రేజ్‌ను ఎక్కువకాలం నిలబెట్టుకోలేకపోయింది షాలిని.
అర్జున్ రెడ్డి తర్వాత మళ్లీ హీరోయిన్‌గా షాలినికి తెలుగులో ఛాన్స్ దక్కడానికి చాలాకాలమే పట్టింది.
ఈ గ్యాప్‌లో షాలిని కోలీవుడ్‌లో, బాలీవుడ్‌లో కూడా అడుగుపెట్టింది.
ఇటీవల రణవీర్ సింగ్‌లాంటి క్రేజీ స్టార్ సినిమాలోనే హీరోయిన్‌గా ఛాన్స్ కొట్టేసింది షాలిని.
'జయేష్ భాయ్ జోర్దార్' చిత్రంలో రణవీర్‌కు జోడీగా నటిస్తుంది షాలిని.
దీంతో పాటు బాలీవుడ్‌లో మరో అవకాశం కూడా అందుకుంది.
ఒకప్పుడు బొద్దుగా ఉండే షాలినీ.. పూర్తిగా తన లుక్‌ను మార్చేసింది. అంతే కాకుండా బాలీవుడ్‌లోనే సెటిల్ అయిపోయేలా కనిపిస్తోంది.