Shalu Chourasiya: కేబీఆర్ పార్క్ వద్ద దాడికి గురైన నటి ఎవరో తెలుసా..?

Shalu Chourasiya: కేబీఆర్ పార్క్ వద్ద నటి షాలూ చౌరాసియాపై దాడి కలకలం రేపింది.;

Update: 2021-11-15 08:31 GMT

Shalu Chourasiya (tv5news.in)

Shalu Chourasiya: కేబీఆర్ పార్క్ వద్ద నటి షాలూ చౌరాసియాపై దాడి కలకలం రేపింది. ఒక దుండగుడు తన ఫోన్‌ను లాకెళ్లాడు. అది ఆపే ప్రయత్నంలో నటికి గాయాలయ్యాయి. దీంతో ఒక్కసారిగా అసలు ఎవరు ఈ నటి.. ఏ సినిమాల్లో నటించింది అని గూగుల్ చేయడం మొదలుపెట్టారు.


షాలూ చౌరాసియా మధ్యప్రదేశ్‌లో పుట్టి పెరిగిన మోడల్.


షాలూ చౌరాసియా మోడల్ నుండి హీరోయిన్‌గా మారింది టాలీవుడ్‌లోనే.


ముందుగా షార్ట్ ఫిల్మ్స్‌తో తన కెరీర్‌ను ప్రారంభించింది షాలూ.


మొదటిసారి శ్రీనివాస్ రెడ్డి హీరోగా వచ్చిన 'భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు' సినిమాతో హీరోయిన్‌గా పరిచయమయ్యింది.


హీరోయిన్‌గా మారిన తర్వాత షాలూ చౌరాసియా.. తన స్క్రీన్ నేమ్‌ను డాలీ షాగా మార్చేసుకుంది.



మొదటి సినిమా విడుదలయిన తర్వాత రెండేళ్లు గ్యాప్ తీసుకున్న షాలూ ఇటీవల 'ది కిల్లర్' అనే సినిమాలో నటించింది.



కార్తిక్ సాయి హీరోగా నటించిన ఈ సినిమాలో డాలీ షాతో పోటు నేహా దేశ్‌పాండే కూడా హీరోయిన్‌గా నటించింది.


చిన్న దర్శకత్వంలో తెరకెక్కిన 'ది కిల్లర్' సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.



Tags:    

Similar News