Shirley Setia: రెండేళ్లుగా తల్లికి దూరమయిన నటి.. సినిమా కారణంగా ఇన్నాళ్లకు..

Shirley Setia: న్యూజిలాండ్‌లో పుట్టి పెరిగి గ్లామర్ ప్రపంచంలో అడుగుపెట్టాలన్న ఆశతో ఇండియాకు వచ్చింది షెర్లీ సేటియా.

Update: 2022-06-14 15:53 GMT

Shirley Setia: న్యూజిలాండ్‌లో పుట్టి పెరిగి గ్లామర్ ప్రపంచంలో అడుగుపెట్టాలన్న ఆశతో ఇండియాకు వచ్చింది షెర్లీ సేటియా.


బాలీవుడ్‌లో ప్రైవేట్ సాంగ్స్‌కు చాలా డిమాండ్ ఉంది. అలాంటి ప్రైవేట్ సాంగ్స్‌తోనే సింగర్‌గా హిందీ ప్రేక్షకులకు దగ్గరయ్యింది.


తన వీడియో సాంగ్స్‌తోనే విపరీతంగా పాపులారిటీ తెచ్చుకుంది.


ఇక ఇండస్ట్రీలో ఇన్నాళ్లు సింగర్‌గా కొనసాగిన తర్వాత హీరోయిన్ అవ్వాలనే తన కల 'నికమ్మ' చిత్రంతో నెరవేరింది.


అభిమన్యు దస్సాని హీరోగా తెరకెక్కుతున్న నికమ్మతో షెర్లీ హీరోయిన్‌గా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టనుంది.


నికమ్మ చిత్రం జూన్ 17న ప్రేక్షకుల ముందుకు రానుండగా ఆ సినిమా చూడడం కోసం షెర్లీ తల్లి ఇండియాకు వచ్చింది


కరోనా కారణంగా రెండు సంవత్సరాలుగా తన తల్లిని చూడలేదని, నికమ్మ సినిమాను వారితో కలిసి చూడడం చాలా ఆనందంగా ఉందని చెప్పుకొచ్చింది షెర్లీ.


ఇక తెలుగులో కూడా షెర్లీ నాగశౌర్య హీరోగా తెరకెక్కుతున్న 'కృష్ణ వింద విహారీ' చిత్రంతో హీరోయిన్‌గా అడుగుపెట్టనుంది.





Tags:    

Similar News