Shivani Rajasekhar: 'నాకు కూడా బాధగానే ఉంది.. సారీ': శివానీ రాజశేఖర్
Shivani Rajasekhar: 'అద్భుతం' అనే చిత్రంతో మొదటిసారి ప్రేక్షకులను పలకరించింది శివానీ రాజశేఖర్.;
Shivani Rajasekhar: టాలీవుడ్‌లో హీరోయిన్లుగా పరిచయమయిన అతి తక్కువమంది వారసుల్లో శివానీ రాజశేఖర్ కూడా ఒకరు. సీనియర్ హీరో రాజశేఖర్ వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శివానీ పుట్టినరోజు నేడు.
శివానీకంటే ముందు తన చెల్లెలు శివాత్మిక హీరోయిన్‌గా పరిచయమయినా.. సక్సెస్ రేటు శివానీకే ఎక్కువగా ఉంది.
'అద్భుతం' అనే చిత్రంతో మొదటిసారి ప్రేక్షకులను పలకరించింది శివానీ రాజశేఖర్.
ఆ తర్వాత 'డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ'తో మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది.
టాలీవుడ్‌లో పరిచయమయిన కొంతకాలానికే కోలీవుడ్‌లో కూడా ఎంట్రీ ఇచ్చింది ఈ భామ.
ఇప్పటికే తమిళంలో కూడా రెండు సినిమాలు చేసింది శివానీ.
ముందుగా హీరోయిన్‌గా మారి ఆ తర్వాత మిస్ ఇండియా పోటీలోకి దిగింది శివానీ రాజశేఖర్.
తమిళనాడు నుండి మిస్ ఇండియా పోటీల్లో పాల్గొనడానికి సిద్ధమయిన శివానీ.. అనూహ్యంగా పోటీ నుండి తప్పుకున్నట్టు పోస్ట్ చేసింది.
తనకు మలేరియా రావడం వల్ల, దాంతో పాటు తన ఎగ్జామ్స్ కూడా అనుకున్న తేదీ కంటే ముందు జరగడం వల్ల తాను మిస్ ఇండియా పోటీల నుండి తప్పుకుంటున్నట్టు క్లారిటీ ఇచ్చింది శివానీ. అంతే కాకుండా అందరికీ సారీ చెప్తూ.. ఈ విషయంపై తనకు కూడా బాధగానే ఉందని వెల్లడించింది.