Taapsee Pannu: యాక్టర్‌ను మాత్రం ఎప్పుడూ డేట్ చేయను: తాప్సీ
Taapsee Pannu: హీరోయిన్‌గానే కాదు ప్రొడ్యూసర్‌గా కూడా తాప్సీ చాలా బిజీ.;
Taapsee Pannu: టాలీవుడ్ నుండి బాలీవుడ్‌కు వెళ్లి అక్కడ తన యాక్టింగ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంది తాప్సీ పన్ను. ప్రస్తుతం దాదాపు అరడజను సినిమాలతో బిజీగా ఉన్న ఈ అమ్మడు పుట్టినరోజు నేడు.
ఇప్పటికే బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్లుగా సత్తా చాటుతున్న ఎంతోమంది నటీమణుల్లో తాప్సీ కూడా ఒకరు.
'ఝుమ్మంది నాదం' చిత్రంతో తెలుగులో హీరోయిన్‌గా అడుగుపెట్టింది తాప్సీ.
మొదటి చిత్రంతోనే ఓవైపు నటనతో, మరోవైపు గ్లామర్‌తో ఆకట్టుకోవడంతో తనకు తెలుగులోనే మరికొన్ని అవకాశాలు దక్కాయి.
కానీ ఎందుకో తనకు తెలుగులో తగిన గుర్తింపు రాలేదు.
బాలీవుడ్‌లో అడుగుపెట్టిన వెంటనే కూడా ఇదే పరిస్థితి. కానీ మెల్లగా అక్కడ నిలదొక్కుకోగలిగింది.
అమితాబ్‌తో నటించిన 'పింక్', 'బద్లా' చిత్రాలు తాప్సీ కెరీర్‌ను మలుపుతిప్పాయి.
హిందీలోనే తన నటనకు గుర్తింపు దక్కడంతో తాప్సీ పూర్తిగా బాలీవుడ్‌లోనే సెటిల్ అయిపోయింది.
హీరోయిన్‌గానే కాదు ప్రొడ్యూసర్‌గా కూడా తాప్సీ చాలా బిజీ.
తాప్సీ నటించిన అన్ని సినిమాలు హిట్ అవ్వకపోయినా.. తన స్పీడ్‌కు మాత్రం బ్రేకులు పడడం లేదు.
ఇక తన రిలేషన్‌షిప్ గురించి అడగగా.. యాక్టర్‌ను మాత్రం ఎప్పుడూ డేట్ చేయనంటోంది ఈ బర్త్ డే బ్యూటీ.