Vani Bhojan: ఎక్స్‌పోజింగ్‌లో తప్పేముంది: యంగ్ బ్యూటీ
Vani Bhojan: పుట్టి, పెరిగింది తమిళనాడులోనే అయినా అక్కడ వాణి భోజన్‌కు వెండితెరపై ముందుగా అవకాశం దక్కలేదు.;
Vani Bhojan: తరుణ్ భాస్కర్ నటించిన 'మీకు మాత్రమే చెప్తా' చిత్రంతో హీరోయిన్‌గా పరిచయమయ్యింది వాణి భోజన్.
పుట్టి, పెరిగింది తమిళనాడులోనే అయినా అక్కడ తనకు వెండితెరపై ముందుగా అవకాశం దక్కలేదు.
నటిగా పరిచయమయిన తర్వాత దాదాపు అయిదేళ్లు తను బుల్లితెరకే పరిమితమయ్యింది.
ఇక తెలుగులో ఫస్ట్ సినిమా 'మీకు మాత్రమే చెప్తా' కూడా అంతగా వర్కవుట్ అవ్వకపోవడంతో తిరిగి కోలీవుడ్ బాటపట్టింది.
టాలీవుడ్ నుండి వెళ్లిన తర్వాత వాణి భోజన్‌కు కోలీవుడ్‌లో బ్యాక్ టు బ్యాక్ అవకాశాలతో పాటు హిట్స్ కూడా దక్కాయి.
వెండితెరపై పరిచయమయిన కొన్నాళ్లకే స్టార్ హీరోలతో కూడా జోడీకట్టింది ఈ భామ.
ప్రస్తుతం దాదాపు డజను తమిళ సినిమాలతో అమ్మడు బిజీబిజీగా గడిపేస్తోంది.
ఓవైపు సినిమాల్లో బిజీగా ఉన్నా కూడా వెబ్ సిరీస్‌ల కోసం కూడా టైమ్ కేటాయిస్తోంది వాణి భోజన్.
ఇప్పటికే 'ట్రిపుల్స్' అనే వెబ్ సిరీస్‌లో నటించిన వాణి భోజన్.. తాజాగా 'తమిళ్ రాకర్స్' అనే సిరీస్‌ను కూడా పూర్తిచేసింది.
తమిళ రాకర్స్ వెబ్ సిరీస్.. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుండగా.. ఆ ప్రమోషన్స్ కార్యక్రమాలలో వాణి బిజీగా ఉంది.
అదే సమయంలో సోషల్ మీడియాలో తన ఎక్స్‌పోజింగ్ గురించి వాణికి ప్రశ్న ఎదురయ్యింది.
ఎక్స్‌పోజింగ్ తప్పేముంది అంటూ వ్యాఖ్యానించింది వాణి. తాను చీర కట్టుకున్నా కూడా గ్లామరస్‌గా ఉందంటూ ప్రశంసించేవారు ఉన్నారని చెప్పుకొచ్చింది. కాలానికి తగినట్టుగా ఆలోచనలు కూడా మారాలని తనదైన శైలిలో సమాధానమిచ్చింది వాణి భోజన్.