Vishnupriya: హీరోయిన్ అవ్వకుండానే చనిపోతానని భయపడ్డాను: విష్ణు ప్రియ
Vishnupriya: ఇటీవల విష్ణు ప్రియకు ఓ మూవీ ఆఫర్ దక్కడంతో.. ప్రమోషన్స్ సమయంలో చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.;
Vishnupriya: ఎంతోమంది సినిమాల్లో హీరో, హీరోయిన్ అవ్వాలనే ఇండస్ట్రీలోకి అడుగుపెడతారు. కానీ అవకాశాలు రాక లేదా లక్ లేక ఇతర ప్రొఫెషన్స్‌లో సెటిల్ అయిపోతుంటారు. అలాంటి వారిలో ఒకరే విష్ణు ప్రియ.
అసలైతే విష్ణు ప్రియకు హీరోయిన్ అవ్వాలని కోరిక ఉంది. కానీ పరిస్థితులు సహకరించక యాంకర్‌గా సెటిల్ అయ్యింది.
ఇటీవల విష్ణు ప్రియకు ఓ మూవీ ఆఫర్ దక్కడంతో.. ప్రమోషన్స్ సమయంలో చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ముందుగా షార్ట్ ఫిల్మ్స్‌తో, యూట్యూబ్ వీడియోలతో ప్రేక్షకులకు పరిచయమయ్యింది విష్ణు ప్రియ.
ఆ తర్వాత బుల్లితెరపై యాంకర్‌గా పరిచయమయ్యింది.
యాంకర్‌గా, ఎంటర్‌టైనర్‌గా ఎంతోమందిని అలరించింది.
ఇక సినిమాల్లోనే ఛాన్సుల కోసం ఇన్‌స్టాగ్రామ్‌లో తన టాలెంట్‌ను బయటపెట్టడం మొదలుపెట్టింది విష్ణు ప్రియ.
డ్యాన్స్‌లతో, ఫోటోషూట్స్‌తో అందరి దృష్టిని ఆకర్షించింది.
ఇటీవల రాఘవేంద్ర రావు సమర్పణలో తెరకెక్కుతున్న 'వాంటెడ్ పండుగాడు' చిత్రంలో ఓ కీలక పాత్ర పోషించే ఛాన్స్ కొట్టేసింది విష్ణు ప్రియ.
'వాంటెడ్ పండుగాడు' మూవీ ప్రమోషన్స్‌లో పాల్గొంటున్నప్పుడు తాను హీరోయిన్ అవ్వకుండానే చనిపోతానేమో అని భయపడ్డానన్న విషయాన్ని బయటపెట్టింది. ప్రస్తుతం ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.