Youtuber Gayathri: డబ్‌స్మాష్‌లతో మొదలై.. యూట్యూబర్‌గా ఎదిగి.. చివరికి..
Youtuber Gayathri: ప్రస్తుతం గుర్తింపు తెచ్చుకున్న ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్‌లలో గాయత్రి కూడా ఒకరు.;
Youtuber Gayathri: కొన్ని గంటల క్రితం గచ్చిబౌలిలో జరిగిన రోడ్డు ప్రమాదం గాయత్రి అలియాస్ డాలీ డీ క్రూజ్ అనే యూట్యూబర్ ప్రాణాలను తీసింది. యూట్యూబ్ ఫ్యామిలీలో ఒకరైన గాయత్రి జీవితం ఇలా అర్థాంతరంగా ఆగిపోవడం తన ఫ్రెండ్స్‌ను తీవ్రంగా కలచివేస్తోంది. అందుకే వారంతా సోషల్ మీడియా వేదికగా తనకు సంతాపం తెలియజేస్తున్నారు.
ప్రస్తుతం యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో దూసుకుపోతున్న సెలబ్రిటీలు అందరూ ఒకప్పుడు డబ్‌స్మాష్‌లతో తమ కెరీర్‌ను ప్రారంభించినవారే. వారిలో ఒకరు గాయత్రి.
ఫేమస్ యూట్యూబర్ షణ్నూ చేసే వీడియోలతో అందరికీ దగ్గరయ్యింది గాయత్రి.
యూట్యూబ్‌లో పలు వీడియోల్లో అలరించిన తర్వాత గాయత్రి సీరియల్స్, సినిమాల్లో కూడా ఛాన్సులు రావడం మొదలయ్యింది.
మోడల్‌గా కూడా చాలావరకు ఫోటోషూట్స్‌తో బిజీగా ఉంటుంది గాయత్రి.
ప్రస్తుతం గుర్తింపు తెచ్చుకున్న ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్‌లలో గాయత్రి కూడా ఒకరు.