Zelensky: భారత్ లో పర్యటించనున్న జెలెన్ స్కీ

ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపర్చుకోవడమే లక్ష్యంగా టూర్;

Update: 2025-08-24 10:03 GMT

ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్ స్కీ త్వరలో భారత్ లో పర్యటించనున్నట్లు సమాచారం. ఇరు దేశాల మధ్య సంబంధాలను మెరుగు పర్చుకోవడమే ఈ పర్యటన ఉద్దేశమని ఉక్రెయిన్ రాయబారి ఒలెక్సాండర్ పోలిష్‌ చుక్ తెలిపారు. జెలెన్ స్కీ పర్యటనకు సంబంధించి తేదీలను ఖరారు చేయడంపై కసరత్తు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. గతేడాది ఆగస్టులో కీవ్ ను సందర్శించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీని భారత్ కు ఆహ్వానించారు.

ఉక్రెయిన్‌లో శాంతి కోసం ప్రధాని మోదీ ఒత్తిడి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పలు సందర్భాల్లో ఉక్రెయిన్, రష్యా మధ్య శాంతి కోసం వాదిస్తూ “ఇది యుద్ధ యుగం కాదు” అని నొక్కి చెప్పారు. పుతిన్, జెలెన్ స్కీలతో టెలిఫోన్ సంభాషణలు జరిపారు. భారతదేశం రెండు దేశాల మధ్య శాంతిని కోరుకుంటుందని వెల్లడించారు. మరోవైపు, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా ఈ ఏడాది చివరలో భారత్‌ కు రానున్నారు.

Tags:    

Similar News