టీమిండియా ప్లేయర్ శుభ్ మన్ గిల్ పై ( Shubman Gill ) మాజీ ప్లేయర్ ఆకాశ్ చోప్రా ( Aakash Chopra ) ప్రశంసలు కురిపించాడు. క్రికెట్ గురించి గిల్‌కు అద్భుతమైన అవగాహన ఉందని, రానున్న కాలంలో అతడు ప్రపంచ క్రికెట్‌లో పెద్ద ఆటగాడిగా మారతాడని పేర్కొన్నాడు.‘శుభ్‌మన్ గిల్ కు గేమ్ పల్స్ తెలుసు. అదే అతడి బిగ్గెస్ట్ క్వాలిటీ. గేమ్ పల్స్ ను కొందరు ప్లేయర్లు తొందరగా గ్రహిస్తే.. మరికొందరు ఆలస్యంగా అర్థం చేసుకుంటారు. మీరు గొప్ప ఆటగాళ్లను చూడండి వారు తొందరగా గేమ్ పల్స్ ను పట్టేస్తారు. విరాట్ కోహ్లీ చాలా త్వరగా గేమ్ పల్స్‌ను అర్థం చేసుకున్నాడు. మహేంద్ర సింగ్ ధోనీ వన్డేల్లో బ్యాటింగ్ పల్స్‌ను తొందరంగా తెలుసుకున్నాడు. శుభ్‌మన్ గిల్ కూడా తెలివైన వాడు. ఆట ఏ దిశగా సాగుతుందో వంద శాతం అర్థం చేసుకుంటున్నాడు. పరిస్థితులకు తగ్గట్టుగా ఎలా ఆడాలో అతనికి బాగా తెలుసు’ అని ఆకాశ్ చోప్రా వివరించాడు.