Indian Cricketers : రోహిత్ తో పాటు విరాట్ కోహ్లీ కూడా రిటైర్ కావాలని అనుకున్నాడు కానీ
విరాట్ కోహ్లీ మే 12, సోమవారం అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాడు. అయితే దీనికి 5 రోజుల ముందు, మే 7న, రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. మే 7న రోహిత్‌తో పాటు విరాట్ కూడా టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించబోతున్నాడని వార్తలు వచ్చాయి.
విరాట్ మే 7న సోషల్ మీడియాలో తన రిటైర్మెంట్ ప్రకటించాలనుకున్నాడు. ఈ విషయాన్ని అతను BCCI ఉన్నతాధికారులకు తెలియజేసాడు కానీ వారు కోహ్లీని కొన్ని రోజులు వేచి ఉండమని కోరారు. ఎందుకంటే అంతకుముందు రాత్రి భారత సైన్యం ' ఆపరేషన్ సిందూర్ ' ప్రారంభించింది . భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో తన రిటైర్ మెంట్ ను ఐదు రోజులు వాయిదా వేశాడు. తన కుటుంబంతో ఎక్కువ సమయం గడపడానికి కోహ్లీ ఈ నిర్ణయం తీసుకున్నాడు.
36 ఏళ్ల విరాట్ కోహ్లీ జూన్ 20, 2011న వెస్టిండీస్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్ ద్వారా అరంగేట్రం చేశాడు. తన 14 సంవత్సరాల టెస్ట్ కెరీర్‌లో 123 మ్యాచ్‌లు ఆడాడు. వీటిలో అతను 46.85 సగటుతో 9230 పరుగులు చేశాడు. ఈ ఫార్మాట్‌లో 10,000 పరుగులు చేసిన నాల్గవ బ్యాట్స్‌మన్ అవుతాడని అభిమానులు ఆశించారు కానీ అంతకు ముందే అతను దానికి వీడ్కోలు పలికాడు. కోహ్లీ టెస్టుల్లో 30 సెంచరీలు, 31 హాఫ్ సెంచరీలు సాధించాడు.