BADMINTON: హైదరాబాద్‌లో ప్రపంచస్థాయి శిక్షణ కేంద్రం

నగరంలో మరో ప్రపంచస్థాయి బ్యాడ్మింటన్ శిక్షణ కేంద్రం;

Update: 2025-05-24 02:00 GMT

హైదరాబాద్‌లో మరో ప్రపంచస్థాయి బ్యాడ్మింటన్ శిక్షణ కేంద్రం అందుబాటులోకి వచ్చింది. ఇండియన్ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ నగరంలో మూడో అకాడమీని ప్రారంభించాడు. ఇప్పటికే రెండు అకాడమీలతో ఎంతోమందిని తీర్చిదిద్దిన గోపీచంద్‌తో కలిసి కోటక్ మహీంద్రా బ్యాంక్ లిమిటెడ్ తమ కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ గచ్చిబౌలిలో అంతర్జాతీయ ప్రమాణాలతో హై ఫెర్ఫార్మెన్స్ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. ఇందులో ఆరు కోర్టులు, పూర్తిస్థాయి స్పోర్ట్స్ సైన్స్ సెంటర్, సింథటిక్‌‌‌‌ ట్రాక్‌‌‌‌, కోచ్‌‌‌‌ డెవలప్‌‌‌‌మెంట్‌‌‌‌ కోర్సు సదుపాయం ఉన్నాయి. ఈ కార్యక్రమంలో అకాడమీ ట్రస్టీ ఎల్వీ సుబ్రహ్మణ్యం, కోటక్ మహీంద్రా బ్యాంకు హోల్‌ టైం డైరెక్టర్ శాంతి ఏకాంబరం, కోటక్ గ్రూప్ప్ర సిడెంట్ జైమిన్ భట్, సైనా నెహ్వాల్ తదితరులు పాల్గొన్నారు.

అధునాతన మౌలిక సదుపాయాలు

ఈ సందర్భంగా గోపీచంద్ మాట్లాడుతూ.. 'అంతర్జాతీయ ప్రమాణాలతో అకాడమీ నెలకొల్పాలన్న నా ప్రతిపాదనకు వెంటనే అంగీకరించినందుకకు కోటక్ మహీంద్రా బ్యాంకుకు ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ అకాడమీ నుంచి మరికొందరు ప్రపంచ, ఒలింపిక్ చాంపియన్లు వెలుగులోకి వస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్న. ప్రతిభావంతులైన క్రీడాకారులకు అత్యుత్తమ శిక్షణ అందించేందుకు అంతర్జాతీయ స్థాయి కోచ్‌లతోపాటు అధునాతన మౌలిక సదుపాయాలు, సౌకర్యాలు అందించనున్నాం' అని పేర్కొన్నారు. కోటక్ మహీంద్రా బ్యాంకు హోల్‌ టైం డైరెక్టర్ శాంతి ఏకాంబరం మాట్లాడుతూ.. దేశం నుంచి ప్రపంచస్థాయి బ్యాడ్మింటన్ క్రీడాకారులను ప్రోత్సహించడం, క్రీడా మౌలిక సదుపాయాలను, మార్గాలను బలోపేతం చేయడంలో పుల్లెల గోపీచంద్‌తో కలిసి పని చేయడం సంతోషంగా ఉంది అని అన్నారు. షట్లర్లు సైనా నెహ్వాల్ మాట్లాడుతూ.. గోపీచంద్ లాంటి కోచ్ దొరకడం తన అదృష్టమన్నారు.

ఇందులో ఆరు కోర్టులు, పూర్తిస్థాయి స్పోర్ట్స్ సైన్స్ సెంటర్, సింథటిక్‌‌‌‌ ట్రాక్‌‌‌‌, కోచ్‌‌‌‌ డెవలప్‌‌‌‌మెంట్‌‌‌‌ కోర్సు సదుపాయం ఉన్నాయి. కార్యక్రమంలో అకాడమీ ట్రస్టీ ఎల్వీ సుబ్రహ్మణ్యం, కోటక్ మహీంద్రా బ్యాంకు హోల్‌ టైం డైరెక్టర్ శాంతి ఏకాంబరం, కోటక్ గ్రూప్ ప్రెసిడెంట్ జైమిన్ భట్, సైనా నెహ్వాల్ తదితరులు హాజరయ్యారు.

Tags:    

Similar News