Archery World Cup 2023: పతక పోరులో "గురి తప్పలేదు"

అర్చరీ ప్రపంచకప్‌లో భారత్‌కు రెండు కాంస్యాలు... సెమీస్‌లో తెలుగమ్మాయి జ్యోతి సురేఖ;

Update: 2023-08-18 02:45 GMT

ఆర్చరీ ప్రపంచకప్‌(Archery World Cup 2023)లో భారత జోరు కొనసాగుతోంది. స్టేజ్‌-4 పోటీల్లో భారత్‌ ఖాతాలో రెండు పతకాలు(bronze in Stage 4) చేరాయి. ఇప్పటికే కాంపౌండ్‌ టీమ్‌ విభాగంలో పురుషుల, మహిళల జట్లు ఫైనల్‌ చేరి కనీసం రెండు రజత పతకాలు ఖరారు చేసుకున్నాయి. రికర్వ్‌ టీమ్‌ విభాగంలో భారత పురుషుల, మహిళల జట్లు మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాలు(men's and the women's teams secured bronze medals ) సొంతం చేసుకున్నాయి.


ఆంధ్రప్రదేశ్‌ క్రీడాకారుడు బొమ్మదేవర ధీరజ్‌తోపాటు అతాను దాస్, తుషార్‌ ప్రభాకర్‌ షెలే్కలతో కూడిన భారత పురుషుల జట్టు కాంస్య పతక మ్యాచ్‌లో స్పెయిన్‌ జట్టుపై గెలుపొందింది. మహిళల టీమ్‌ రికర్వ్‌ కాంస్య పతక మ్యాచ్‌లో అంకిత, భజన్‌ కౌర్, సిమ్రన్‌జిత్‌ కౌర్‌లతో కూడిన భారత జట్టు ‘షూట్‌ ఆఫ్‌’లో మెక్సికో జట్టును ఓడించింది. సెమీఫైనల్లో చైనీస్‌ తైపీ జట్టు చేతిలో ఓడిపోయిన భారత్‌ కాంస్య పతకం కోసం ఆడింది.


కాంపౌండ్‌ మహిళల వ్యక్తిగత విభాగంలో తెలుగమ్మాయి జ్యోతి సురేఖ(Jyothi Vennam's ) సెమీస్‌లో అడుగుపెట్టింది. క్వార్టర్స్‌లో టాప్‌ సీడ్‌ సురేఖ 147-144 తేడాతో మెక్సికోకు చెందిన క్వింటెరోపై గెలిచింది. హోరాహోరీగా సాగిన పోరులో చివరి రౌండ్లో ఆధిపత్యం సాధించిన సురేఖ విజేతగా నిలిచింది. నాలుగు రౌండ్లు ముగిసే సరికి 117-117తో ఇద్దరూ సమానంగా నిలిచారు. నిర్ణయాత్మక అయిదో రౌండ్లో ఒత్తిడిని దాటి సురేఖ విజయం సాధించింది. శనివారం సెమీస్‌లో బ్రిటన్‌కు చెందిన ఎల్లా గిబ్సన్‌తో సురేఖ తలపడుతుంది. మరో క్వార్టర్స్‌లో ప్రపంచ ఛాంపియన్‌ అదితి స్వామి ప్రపంచ నంబర్‌వన్‌ గిబ్సన్‌ చేతిలో అనూహ్యంగా ఓటమి పాలైంది. 

Tags:    

Similar News