ASIA CUP: ఉత్కంఠభరిత పోరులో భారత్ "సూపర్" గెలుపు

సూపర్ ఓవర్లో శ్రీలంకపై భారత్ విజయం.. తొలుత 202 పరుగులు చేసిన భారత్.. సరిగ్గా 202 రన్స్ చేసి టై చేసిన లంక

Update: 2025-09-27 02:00 GMT

ఆసి­యా కప్‌ సూ­ప­ర్‌-4లో భా­గం­గా భా­ర­త్‌, శ్రీ­లంక మధ్య జరి­గిన మ్యా­చ్‌ టై అయిం­ది. దీం­తో మ్యా­చ్‌ సూ­ప­ర్‌ ఓవ­ర్‌­కు వె­ళ్లిం­ది. తొ­లుత బ్యా­టిం­గ్‌ చే­సిన టీ­మ్‌­ఇం­డి­యా 202/5 పరు­గు­లు చే­సిం­ది. అనం­త­రం బ్యా­టిం­గ్‌­కు ది­గిన శ్రీ­లంక 20 ఓవ­ర్ల­లో 5 వి­కె­ట్ల నష్టా­ని­కి 202 పరు­గు­లు చే­సిం­ది. పా­తు­మ్‌ ని­స్సాంక (107) శతకం బా­దా­డు. కు­శా­ల్‌ పె­రీ­రా (58) రా­ణిం­చా­డు. భారత బౌ­ల­ర్ల­లో హా­ర్ది­క్‌, వరు­ణ్‌, కు­ల్‌­దీ­ప్‌, అర్ష్‌­దీ­ప్‌, హర్షి­త్‌ రాణా ఒక్కో వి­కె­ట్‌ తీ­శా­రు.   

సూపర్ ఓవర్ ఇలా...

సూపర్ ఓవర్లో శ్రీలంక తొలుత బ్యాటింగ్ చేసింది. భారత్ తరపున హర్ష్ దీప్ సింగ్ బౌలింగ్ చేశాడు. హర్ష్ దీప్ తొలి బంతికే లంక బ్యాటర్ కుశాల్ పెరీరాను అవుట్ చేశాడు. స్కోరు బోర్డుపై ఒక్క పరుగు కూడా చేరకముందే లంక తొలి వికెట్ కోల్పోయింది. అతర్వాత కూడా హర్ష్ దీప్ సింగ్ కూడా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. రెండు బంటి డాట్ అవ్వగా తర్వాత నాటకీయ పరిణామాలు జరిగాయి. హర్ష్ దీప్ బౌలింగ్ లో బాల్ కీపర్ చేతికి వెళ్లగా లంక బ్యాటర్లు పరుగుకు యత్నించారు. అయితే అప్పటికే సంజు శాంసన్ వికెట్లను గిరాటేశాడు. దానికి ముందే అంపైర్ అవుట్ ఇవ్వడంతో అది డెడ్ బాల్ అయింది. దీంతో లంక బ్యాటర్ బతికిపోయాడు. అయితే ఈఅవకాశాన్ని లంక బ్యాటర్ వినియోగించలేకపోయారు. తర్వాతి బంతికి హర్ష్ దీప్ మరో వికెట్ తీయడంతో లంక బ్యాటింగ్ ముగిసింది. లంక కేవలం రెండు పరుగులే చేయగలిగింది. అయితే సూర్య, గిల్ మూడు పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగారు. ఆడిన తొలి బంతికే సూర్య మూడు పరుగులు సాధించడంతో భారత్ విజయం సాధించింది.

 దంచికొట్టిన అభిషేక్

ఈ మ్యా­చు­లో టాస్ గె­లి­చిన బం­గ్లా.. భా­ర­త్ ను బ్యా­టిం­గ్ కు ఆహ్వా­నిం­చిం­ది. మొదట బ్యా­టిం­గ్‌­కు ది­గిన టీ­మ్‌­ఇం­డి­యా ని­ర్ణీత 20 ఓవ­ర్ల­లో 5 వి­కె­ట్ల నష్టా­ని­కి 202 పరు­గు­లు చేసి శ్రీ­లం­క­కు భారీ లక్ష్యా­న్ని ని­ర్దే­శిం­చిం­ది. ఆసి­యా­క­ప్‌ 2025లో ఇప్ప­టి­వ­ర­కు ఒక టీ­మ్‌ చే­సిన అత్య­ధిక స్కో­ర్‌ ఇదే కా­వ­డం వి­శే­షం. భారత బ్యా­ట­ర్ల­లో అభి­షే­క్‌ శర్మ, తి­ల­క్‌­వ­ర్మ రా­ణిం­చా­రు. అభి­షే­క్‌ 31 బం­తు­ల్లో 8 ఫో­ర్లు, 2 సి­క్స్‌ సా­యం­తో 61 పరు­గు­లు చే­శా­డు. ఈ టో­ర్నీ­లో అత­డి­కి­ది వరు­స­గా మూడో హా­ఫ్‌­సెం­చ­రీ. తి­ల­క్‌ వర్మ 34 బం­తు­ల్లో 4 ఫో­ర్లు, 1 సి­క్స్‌ సా­యం­తో 49 పరు­గు­ల­తో నా­టౌ­ట్‌­గా ని­లి­చా­డు. సం­జు­శాం­స­న్‌ 23 బం­తు­ల్లో 1 ఫో­ర్‌, 3 సి­క్స్‌ల సా­యం­తో 39 పరు­గు­లు చే­శా­డు. శు­భ్‌­మ­న్‌ గి­ల్‌ (4; 3బం­తు­ల్లో), హా­ర్ది­క్‌ పాం­డ్య (2; 3 బం­తు­ల్లో) వి­ఫ­ల­మ­య్యా­రు. అక్ష­ర్‌ పటే­ల్‌ 21 పరు­గు­ల­తో నా­టౌ­ట్‌­గా ని­లి­చా­డు. అభి­షే­క్ శర్మ కే­వ­లం 31 బం­తు­ల్లో 61 పరు­గు­లు చే­శా­డు. ఇం­దు­లో ఏకం­గా 8 ఫో­ర్లు, రెం­డు సి­క్స­ర్లు ఉం­డ­టం వి­శే­షం. తర్వాత శు­భ­మ­న్ గిల్, స్కి­ప్ప­ర్ సూ­ర్య­కు­మా­ర్ యా­ద­వ్ వరు­స­గా, 4, 12 పరు­గు­ల­కు ఔట్ అవ్వ­గా, తి­ల­క్ వర్మ శ్రీ­లంక బౌ­ల­ర్ల మీద వి­రు­చు­కు­ప­డ్డా­డు. 34 బం­తు­ల్లో 49 పరు­గు­లు చే­శా­డు. అటు, సంజు శాం­స­న్ కూడా 23 బం­తు­ల్లో 23 బం­తు­ల్లో 39 పరు­గు­లు చే­య­డం, చి­వ­రి­లో అక్ష­ర్ పటే­ల్ 15 బం­తు­ల్లో 21 పరు­గు­లు చే­య­డం­తో భా­ర­త్ భారీ స్కో­రు సా­ధిం­చ­గ­లి­గిం­ది. లంక జట్టులో పాథుమ్ నిస్సంక అద్భుత శతకం సాధించగా మిగిలిన బ్యాటర్లు విఫలమయ్యారు.

Tags:    

Similar News