ASIA CUP: నేడే దాయాదుల మధ్య తుది సమరం

ఇవాళే ఆసియా కప్ ఫైనల్... చరిత్రలో తొలిసారి భారత్-పాక్ ఢీ... నేడు రాత్రి 8 గంటలకు మ్యాచ్ షురూ... ఫేవరెట్‌గా బరిలోకి టిమిండియా

Update: 2025-09-28 06:30 GMT

ఆసి­యా కప్‌­న­కు 41 ఏళ్ల చరి­త్ర ఉంది. కానీ ఇప్ప­టి­వ­ర­కూ ఇం­దు­లో భా­ర­త్-పాక్ ఫై­న­ల్లో తల­ప­డ­లే­దు. కానీ తొ­లి­సా­రి భా­ర­త్ - పా­కి­స్థా­న్‌ ఫై­న­ల్‌­లో తల­ప­డు­తు­న్నా­యి. ఇప్ప­టి­కి ఎని­మి­ది­సా­ర్లు భా­ర­త్ ఛాం­పి­య­న్‌­గా ని­ల­వ­గా.. పా­కి­స్థా­న్‌ కే­వ­లం రెం­డు­సా­ర్లే వి­జే­త­గా మా­రిం­ది. ప్ర­స్తుత ఆసి­యా కప్‌ ఫై­న­ల్‌­లో­నూ టీ­మ్‌­ఇం­డి­యా­నే ఫే­వ­రె­ట్‌. కానీ, గతం­లో యూ­ఏ­ఈ­లో ‘ఫై­న­ల్‌’ మ్యా­చుల ఫలి­తా­ల­ను చూ­స్తే కా­స్త ఆం­దో­ళ­న­క­ర­మే. మరీ ము­ఖ్యం­గా పా­కి­స్థా­న్‌­తో ఐసీ­సీ టో­ర్నీ­ల్లో యూఏఈ గడ్డ­పై ఆడిన ఫై­న­ల్ మ్యా­చు­ల్లో భా­ర­త్‌­కు పె­ద్ద­గా కలి­సి­రా­లే­దు. అలా­గే ఓవ­రా­ల్‌­గా ఇరు జట్లూ 10 ఫై­న­ల్స్‌­లో తల­ప­డి­తే.. టీ­మ్‌­ఇం­డి­యా కే­వ­లం మూ­డు­సా­ర్లే వి­జ­యం సా­ధిం­చిం­ది.

ఆధిపత్యం మనదే

1984లో తొ­లి­సా­రి ఆసి­యా­క­ప్ టో­ర్నీ జరి­గిం­ది. తొలి ఎడి­ష­న్‌­లో కే­వ­లం మూడు జట్లు మా­త్ర­మే పా­ల్గొ­న్నా­యి. ప్ర­స్తు­తం ఆ సం­ఖ్య 8కి చే­రిం­ది. 1984 నుం­చి 2023 వరకు 16 ఎడి­ష­న్లు జరి­గా­యి. అం­దు­లో భారత జట్టే ఆధి­ప­త్యం ప్ర­ద­ర్శిం­చిం­ది. ఏకం­గా 8 సా­ర్లు వి­జే­త­గా ని­లి­చిం­ది. ఆ తర్వాత శ్రీ­లంక 6 సా­ర్లు, పా­కి­స్థా­న్ రెం­డు సా­ర్లు వి­జే­త­గా ని­లి­చిం­ది. బం­గ్లా­దే­శ్ మూడు సా­ర్లు ఫై­న­ల్ చే­రి­నా.. రన్న­ర­ప్‌­తో­నే సరి­పె­ట్టు­కుం­ది. పా­కి­స్థా­న్ కూడా 2000, 2012లో టై­టి­ల్ సా­ధిం­చిం­ది. కానీ అప్పు­డు ఆ జట్టు ఇతర జట్ల­తో­నే ఫై­న­ల్ మ్యా­చ్ ఆడిం­ది. కానీ ఈసా­రి మా­త్రం తొ­లి­సా­రి ఆసి­యా­క­ప్ ఫై­న­ల్‌­లో దా­యా­దుల పో­రు­ను చూ­డ­బో­తు­న్నాం.

తుది పోరుకు టీమిండియా సిద్ధం

ఆసి­యా కప్ 2025 టో­ర్నీ­లో వరుస వి­జ­యా­ల­తో దు­మ్ము­రే­పు­తు­న్న టీ­మిం­డి­యా తుది పో­రు­కు సి­ద్ద­మైం­ది. ఓట­మె­రు­గ­ని జట్టు­గా ఫై­న­ల్ చే­రిన సూ­ర్య సేన.. ఆది­వా­రం జరి­గే ఫై­న­ల్లో దా­యా­దీ పా­కి­స్థా­న్‌­తో అమీ­తు­మీ తే­ల్చు­కో­నుం­ది. ఈ టో­ర్నీ­లో ఇప్ప­టి­కే వరు­స­గా 6 వి­జ­యా­లు సా­ధిం­చిన టీ­మిం­డి­యా అదే జో­రు­లో పా­కి­స్థా­న్‌­ను మట్టి­క­రి­పిం­చి టై­టి­ల్ కై­వ­సం చే­సు­కో­వా­ల­నే పట్టు­ద­ల­తో ఉంది. ఇప్ప­టి­కే ఈ టో­ర్నీ­లో రెం­డు సా­ర్లు పా­కి­స్థా­న్‌­ను భా­ర­త్ మట్టి­క­రి­పిం­చిం­ది. లీగ్ మ్యా­చ్‌­లో 7 వి­కె­ట్ల తే­డా­తో చి­త్తు చే­సిన భా­ర­త్.. సూ­ప­ర్-4 మ్యా­చ్‌­లో 6 వి­కె­ట్ల తే­డా­తో ఓడిం­చిం­ది. ఈ రెం­డు మ్యా­చ్‌­ల్లో పా­కి­స్థా­న్ తే­లి­పో­యిం­ది. కనీ­సం ఫై­న­ల్లో అయి­నా పోటీ ఇస్తుం­దా? లేక ఓట­మి­కి తల వం­చు­తుం­దా? అనే­ది చూ­డా­లి. 41 ఏళ్ల ఆసి­యా కప్ చరి­త్ర­లో­నే భా­ర­త్, పా­కి­స్థా­న్ తొ­లి­సా­రి ఫై­న­ల్ ఆడు­తు­న్నా­యి.

రెండు మార్పులతో టీమిండియా..

లీగ్, సూ­ప­ర్ 4 దశలో పా­కి­స్థా­న్ చి­త్త­యి­నా ఆ జట్టు­ను ఏ మా­త్రం తక్కువ అం­చ­నా వే­య­డా­ని­కి లేదు. సూ­ప­ర్-4లో బం­గ్లా­దే­శ్, శ్రీ­లం­క­ను ఓడిం­చి ఫై­న­ల్‌­కు చే­రిం­ది. అదే జో­రు­లో భా­ర­త్‌­ను ఓడిం­చి ప్ర­తీ­కా­రం తీ­ర్చు­కో­వా­ల­నే కసి­తో పా­కి­స్థా­న్ ఉంది. కా­బ­ట్టి ఈ మ్యా­చ్‌­ను టీ­మిం­డి­యా ఏ మా­త్రం లైట్ తీ­స్కో­దు. శ్రీ­లం­క­తో సూ­ప­ర్-4 మ్యా­చ్‌­లో రెం­డు మా­ర్పు­ల­తో బరి­లో­కి ది­గిన టీ­మిం­డి­యా.. ఫై­న­ల్‌­కు ముం­దు జస్‌­ప్రీ­త్ బు­మ్రా, శి­వ­మ్ దూ­బే­ల­కు రె­స్ట్ ఇచ్చిం­ది. పా­కి­స్థా­న్‌­తో ఫై­న­ల్లో ఈ ఇద్ద­రూ తి­రి­గి బరి­లో­కి ది­గ­ను­న్నా­రు. పాం­డ్యా గాయం కూడా టీ­మిం­డి­యా­ను కల­వ­ర­పె­డు­తోం­ది.

Tags:    

Similar News