వేలి గాయం కారణంగా లార్డ్స్ టెస్ట్‌లో బ్యాటింగ్‌కు పరిమితమైన రిషబ్ పంత్ మాంచెస్టర్ టెస్ట్ మ్యాచ్‌లో ఆడటం ఖాయంగా కనిపిస్తోంది. అయితే అతను వికెట్లు కీపింగ్ చేస్తాడా? లేదో ఇంకా ఖచ్చితంగా తెలియదు. గతంలో వచ్చిన నివేదికల ప్రకారం పంత్ మాంచెస్టర్ టెస్ట్‌లో బ్యాట్స్‌మన్‌గా మాత్రమే ఆడతాడని అంతా అనుకున్నారు. కానీ అతడి తాజా వీడియో చూస్తే.. రిషబ్ పంత్ బ్యాటింగ్‌తో పాటు వికెట్ కీపింగ్ కూడా ప్రాక్టీస్ చేస్తున్నాడు.
లార్డ్స్‌లో జరిగిన చివరి టెస్ట్ మ్యాచ్ మొదటి రోజున రిషబ్ పంత్ గాయపడ్డాడు. వికెట్ కీపింగ్ చేస్తున్నప్పుడు పంత్ ఎడమ వేలికి గాయం కావడంతో ధ్రువ్ వికెట్ కీపింగ్ బాధ్యతలను చేపట్టాడు. అయితే పంత్ రెండు ఇన్నింగ్స్‌లలోనూ బ్యాటింగ్ చేసి అర్ధ సెంచరీలు సాధించాడు. అప్పటి నుండి, పంత్ పూర్తిగా ఫిట్‌గా ఉండి నాల్గవ టెస్ట్ మ్యాచ్‌లో ఆడగలడా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
పంత్ బ్యాట్స్‌మన్‌గా మాత్రమే ఆడుతాడా..? జురెల్‌కు వికెట్ కీపింగ్ బాధ్యత ఇస్తారా? అనేది ఆసక్తికరంగా ఉంది. కానీ జూలై 23న ప్రారంభమయ్యే ఈ మ్యాచ్‌కు 2 రోజుల ముందు, పంత్ ఓల్డ్ ట్రాఫోర్డ్ మైదానంలో వికెట్ కీపింగ్ ప్రాక్టీస్ చేయడం అభిమాను సంతోషానికి కారణమైంది. దీంతో అతను మాంచెస్టర్ టెస్ట్‌లో ఆడటం ఖాయమని సమాచారం. మరోవైపు ఈ సిరీస్‌లో పంత్ అత్యధిక సిక్సులు, అత్యధిక రన్స్ రికార్డులు నెలకొల్పే అవకాశం ఉంది.