బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్‌కు షాక్ తగిలింది. అంతర్జాతీయ, దేశవాళీ క్రికెట్‌లో అతను బౌలింగ్ చేయకుండా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. తొలుత ఇంగ్లండ్, వేల్స్ క్రికెట్ బోర్డు ఈ ఆల్‌రౌండర్‌పై నిషేధం విధించగా, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు కూడా తాజాగా ఈ ప్రకటన చేసింది. కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో అతడి బౌలింగ్ యాక్షన్‌పై ఫిర్యాదు అందగా, పరీక్షలో మోచేయి పరిధి 15 డిగ్రీలను మించిన్నట్లు తేలింది. ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు విచారణ అనంతరం షకీబ్ బౌలింగ్ యాక్షన్‌ను సరి చేయాల్సిందిగా సూచించింది. ఇటీవల షకీబ్, భారత్‌తో టెస్టు సిరీస్ ఆడాలని భావించారు, కానీ బంగ్లాదేశ్‌లో జరిగిన అల్లర్ల కారణంగా అతడు స్వదేశానికి వెళ్లలేదు.