టీమిండియా స్టార్ పేసర్ జస్రీత్ బుమ్రా మరో కొత్త చరిత్ర సృష్టించాడు. లీడ్స్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న తొలి టెస్టులో బుమ్రా అద్భుతమైన బౌలింగ్ సత్తా చాటుతున్నాడు. జాక్ క్రాలే, బెన్ డకెట్, జో రూట్, క్రిస్ వోక్స్ వంటి కీలకమైన నాలుగు వికెట్లు పడగొట్టి టీమిండియాను ఆదుకున్నాడు. ఈ క్రమంలోనే బుమ్రా తన ఖాతాలో మరో అరుదైన రికార్డు వేసుకున్నాడు. సేనా (ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజి లాండ్ ) దేశాల్లో అత్యధిక వికెట్లు తీసిన తొలి ఆసియా బౌలర్గా జప్రీత్ బుమ్రా సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్లో బెన్ డకెట్ ను ఔట్ చేసిన బుమ్రా సేనా దేశాల్లో అత్యధిక వికెట్లు తీసిన ఆసియా బౌలర్గా నిలిచాడు. ఈ క్రమంలోనే పాక్ దిగ్గజం వసీం అక్రమ్ పేరిట ఉన్న (146 వికెట్లు) ఆల్టైమ్ రికార్డును బుమ్రా (147) బద్దలు కొట్టాడు. ఈ జాబితాలో అనిల్ కుంబ్లే 141 వికెట్లు మూడో స్థానంలో ఉన్నాడు.