Champions Trophy Winner : ఛాంపియన్స్ ట్రోఫీ విన్నర్‌కు రూ.20.8 కోట్లు

Update: 2025-02-15 06:15 GMT

ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ప్రైజ్ మనీని ఐసీసీ ప్రకటించింది. మెగా టోర్నీ విజేతగా నిలిచిన జట్టుకు రూ.20.8 కోట్లు, రన్నరప్‌గా నిలిచిన జట్టుకు రూ.10.4 కోట్లు ఇవ్వనుంది. అలాగే సెమీఫైనల్ చేరిన జట్లకు చెరో రూ.5.26 కోట్లు అందజేస్తుంది. మొత్తం రూ.60 కోట్ల ప్రైజ్ మనీని అన్ని జట్లకు ఇవ్వనుంది. ఈ నెల 19 నుంచి మెగా లీగ్ ప్రారంభం కానుంది. 23న దాయాది పాకిస్థాన్‌తో భారత్ తలపడనుంది.

గత ఛాంపియన్స్ ట్రోఫీతో పోలీస్తే ఈ మొత్తం చాలా ఎక్కువ. చివరగా 2013లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ జరిగింది. ఇందులో టైటిల్ సాధించిన పాకిస్థాన్‌కు రూ. 14.18 కోట్లు దక్కాయి. రన్నరప్‌గా నిలిచిన టీమిండియా రూ. 7 కోట్లు సొంతం చేసుకుంది. సెమీ ఫైనల్ చేరిన రెండు జట్లు రూ. 3 కోట్ల చొప్పున అందుకున్నాయి. ఇక ఐదు, ఆరో స్థానాల్లో నిలిచిన జట్లకు రూ. 58 లక్షలు.. చివరి రెండు స్థానాల్లో ఉన్న జట్లకు రూ. 39 లక్షలు అందాయి.

Tags:    

Similar News