US Open: గాఫ్ ముందంజ... వీనస్‌కు షాక్
యూఎస్ ఓపెన్‌లో మూడో రౌండ్‌లో ప్రవేశించిన గాఫ్.... అల్కరాస్ శుభారంభం..;
యూఎస్ ఓపెన్(US Open) మహిళల సింగిల్స్‌లో అమెరికా స్టార్, ఆరో సీడ్ కోకో గాఫ్(Coco Gauff)హవా కొనసాగుతోంది. రెండో రౌండ్‌లో రష్యాకు చెందిన 16 ఏళ్ల మీరా ఆండ్రీవా916-year-old Andreeva )పై 6-3, 6-2 తేడాతో 19 ఏళ్ల గాఫ్ గెలుపొంది మూడో రౌండ్‌లో అడుగుపెట్టింది. 76 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో గాఫ్ తన ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేసింది. మరో మ్యాచ్‌లో ఫ్రాన్స్‌కు చెందిన ఏడో సీడ్ గార్సియా... చైనాకు చెందిన యఫాన్ వాంగ్ చేతిలో 4–6, 1–6తేడాతో పరాజయం పాలైంది. 2000, 2001 ఛాంపియన్ వీనస్ విలియమ్స్‌కు కూడా ఓటమి తప్పలేదు. బెల్జియంకు చెందిన గ్రీట్ మినెన్ చేతిలో 1–6, 1–6 తేడాతో వరుస సెట్లలో వీనస్ ఓడిపోయింది, గ్రీట్ మినెన్ ధాటికి పోరాడకుండానే వీనస్ పరాజయం పాలైంది. 12వ సీడ్ క్రిచికోవా కూడా తొలి రౌండ్‌లోనే ఇంటిదారి పట్టింది. ఇటలీకి చెందిన లూసియా బ్రోన్‌జెట్టి చేతిలో క్రిచికోవా 4–6, 6–7 (3/7)తో క్రిచినోవా ఓడిపోయింది. . పురుషుల సింగిల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ అల్‌కరాజ్ (స్పెయిన్), ఆరో సీడ్ సినెర్ (ఇటలీ) రెండో రౌండ్‌లోకి చేరారు.
అంతకుముందు ఏడాది తర్వాత యుఎస్ ఓపెన్ ఆడుతున్న సెర్బియా స్టార్ నొవాక్ జకోవిచ్ అలవోకగా రెండో రౌండ్‌లోకి అడుగు పెట్టాడు. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‌లో రెండో సీడ్ జొకోవిచ్ 6–0, 6–2, 6–3తో ఫ్రాన్స్‌కు చెందిన అలెగ్జాండర్ ముల్లర్‌పై విజయం సాధించాడు. తొలి సెట్లో ప్రత్యర్థికి ఒక్క గేమ్ కూడా కోల్పోకుండా గెలిచిన జకోవిచ్‌కు.. రెండు, మూడు సెట్లలో కాస్త ప్రతిఘటన ఎదురైనా తేలిగ్గానే విజయాన్ని అందుకున్నాడు.
ముల్లర్‌తో గంటా 35 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో జొకోవిచ్ ఆరు ఏస్‌లు సంధించాడు. నెట్ వద్దకు 23 సార్లు దూసుకొచ్చి 20 సార్లు పాయింట్లు గెలిచాడు. ఈ గెలుపుతో 36 ఏళ్ల జొకోవిచ్ యూఎస్ ఓపెన్ ముగిశాక తుది ఫలితంతో సంబంధం లేకుండా మళ్లీ ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌ను సొంతం చేసుకుంటాడు. కొవిడ్-19 టీకా వేసుకోకపోవడంతో జకోవిచ్‌ను గతేడాది యుఎస్ ఓపెన్లో ఆడేందుకు అనుమతించలేదు.
మరోవైపు నాలుగో సీడ్ హోల్గర్ రూనె పోరాటం తొలి రౌండ్‌లోనే ముగిసింది. ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ టోర్నీల్లో క్వార్టర్ ఫైనల్ చేరిన రూనె 3–6, 6–4, 3–6, 2–6తో కార్‌బెలాస్ బేనా చేతిలో ఓడిపోయాడు. మరో మ్యాచ్‌లో రష్యా స్టార్ డానియల్ మెద్వెదెవ్ 6-1, 6-1, 6-0తో బలాజ్స్ (హంగేరీ)ను చిత్తు చేశాడు. ఏడోసీడ్ సిట్సిపాస్ (గ్రీస్) కూడా ముందంజ వేశాడు. అతడు 6-2, 6-3, 6-4తో రోనిచ్ (కెనడా)పై నెగ్గాడు. టియాఫో (అమెరికా), మనారియో (ఫ్రాన్స్), డేవిడోవిచ్ (స్పెయిన్), ఫ్రిట్జ్ (అమెరికా) కూడా తొలి రౌండ్ దాటారు.
అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, ఆయన సతీమణి మిచెల్లీ యుఎస్ ఓపెన్‌కు విచ్చేశారు. కొకోగాఫ్ మ్యాచ్‌ను తిలకించారు. పురుషులతో సమానంగా మహిళలకు సమాన నగదు బహుమతి ఇచ్చిన తొలి టోర్నీగా యుఎస్ ఓపెన్ 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మిచెల్లీ మాట్లాడారు. సమాన ప్రైజ్‌మనీ కోసం పోరాడిన బిల్లీ జీన్ కింగ్‌ను ఆమె అభినందించారు.