CRICKET: దేశవాళీలో నయా సంచలనం "మలేవర్"
దులీప్ ట్రోఫీలో సంచలన ఇన్నింగ్స్... \భారీ శతకంతో మెరిసిన డానిష్ మలేవర్...మొదటి రోజు ఆటలోనే 198 రన్స్... మలేవర్ ఇన్నింగ్స్‌లో 35 ఫోర్లు, ఒక సిక్స్
దేశవాళీ క్రికెట్లో మరో యువ క్రికెటర్ దూసుకొచ్చాడు. దులిప్ ట్రోఫీలో బ్యాటర్ డానిష్ మలేవర్ సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. దులీప్ ట్రోఫీ తొలి క్వార్టర్ ఫైనల్లో భాగంగా నార్త్ ఈస్ట్ జోన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సెంట్రల్ జోన్ బ్యాటర్ మలేవర్ డబుల్ సెంచరీకి రెండు పరుగుల దూరంలో నిలిచాడు. మొదటిరోజు ఆటలో 35 ఫోర్లు, 1 సిక్సర్ సాయంతో 198 పరుగులు బాదాడు. రెండో రోజు అతడు డబుల్ సెంచరీ మార్క్ అందుకునే అవకాశాలు ఉన్నాయి. విదర్భకు చెందిన మలేవర్ సహా కెప్టెన్ రజత్ పాటిదార్ (96 బంతుల్లో 125) చెలరేగడంతో సెంట్రల్ జోన్ మొదటి రోజు ఆట ముగిసేవరకు 77 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 432 రన్స్ చేసింది.
రోజంతా మలేవర్దే...
మొదటి రోజున 21 ఏళ్ల డానిష్ మలేవర్ అందరి దృష్టిని ఆకర్షించాడు. 219 బంతులు ఎదుర్కొని 198 పరుగులు సాధించాడు. కెప్టెన్ రజత్ పాటిదార్‌తో కలిసి 174 బంతుల్లో 205 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. రంజీ ట్రోఫీ ఫైనల్ 2025లో మలేవర్ కేరళపై 153, 73 పరుగులు చేశాడు. దాంతో విదర్భ టైటిల్ గెలుచుకుంది. ఇప్పటివరకు మలేవర్ 10 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌ల్లో 65.4 సగటుతో 981 పరుగులు చేశాడు. ఇటీవలే దేశవాళీ దిగ్గజం ఛతేశ్వర్ పుజారా అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలిగాడు. ఈ నేపథ్యంలో ‘నయా వాల్’ పుజారాకు వారసుడు వచ్చాడు అని ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మలేవర్ రైటార్మ్ బ్యాటర్ మాత్రమే కాకుండా మంచి లెగ్‌బ్రేక్ బౌలర్ కూడా. రజత్ పాటిదార్ కేవలం 80 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 66వ ఓవర్లో ఫిరోజామ్ జోతిన్ బౌలింగ్‌లో క్యాచ్ అవుట్ అయ్యాడు. పాటిదార్ 96 బంతుల్లో 130.20 స్ట్రైక్ రేట్‌తో 125 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లో 21 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. పాటిదార్ 69 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 4863 పరుగులు చేశాడు.
పాటిదార్ శతకం
ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ దులీప్ ట్రోఫీ రెండో క్వార్టర్ ఫైనల్లో విధ్వంసకర శతకంతో విరుచుకుపడ్డాడు. ఈ టోర్నీలో సెంట్రల్ జోన్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న రజత్.. నార్త్ ఈస్ట్ జోన్‌తో ఇవాళ (ఆగస్ట్ 28) ప్రారంభమైన మ్యాచ్‌లో కేవలం 80 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. ఇందులో 18 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. ఓపెనర్ ఆయుశ్ పాండే 3 పరుగులకే ఔటయ్యాడు. ఆకాశ్ చౌదరీ బౌలింగ్‌లో హేమ్ ఛెత్రీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. ఆయుశ్ పాండే ఔటయ్యాక సెంట్రల్ జోన్ మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడింది. మరో ఓపెనర్ ఆర్యన్ జుయల్ 60 పరుగుల వద్ద అనుకోకుండా గాయపడి రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. అనంతరం బరిలోకి దిగిన రజత్ పాటిదార్ టీ20లకు తలపిస్తూ షాట్లు ఆడి సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
ప్రైజ్ మనీ ఎంత?
బీసీసీఐ గతంలోనే దేశవాళీ క్రికెట్ ప్రైజ్ మనీని పెంచుతామని ప్రకటించింది. దాని ప్రకారం, ఈసారి దలీప్ ట్రోఫీ గెలిచిన జట్టుకు రూ. 1 కోటి ప్రైజ్ మనీ లభిస్తుంది. రన్నరప్ జట్టుకు రూ. 50 లక్షలు లభిస్తాయి. గతంలో విజేతకు రూ. 40 లక్షలు, రన్నరప్‌కు రూ. 20 లక్షలు మాత్రమే ఇచ్చేవారు.