విండుల్డన్‌లో టాప్ సీడ్ ఆటగాళ్లంతా 4వ రౌండ్ గెలిచి క్వార్టర్స్‌కి చేరుకున్నారు. వరల్డ్ నంబర్ ౧ కార్లోస్ అల్కరాజ్, సెర్బియన్ స్టార్ నొవాక్ జకోవిచ్, మహిళల నంబర్ 3 రిబకీనాలు క్వార్టర్స్ చేరారు.
టాప్ సీడ్ అల్కరాజ్ 4వ రౌండ్‌లో మాట్టే బెర్రెట్టినిని 3-6 6-3 6-3 6-3 తేడాతో ఓడించాడు. మొదటి సారి వింబుల్డన్ క్వార్టర్ ఫైనల్ చేరాడు. మొదటి సెట్‌ని కోల్పోయిన అల్కరాజ్, ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా తర్వాతి త్రీ సెట్లను కైవసం చేసుకున్నాడు. 20 ఏళ్ల చిన్న వయస్కుడైన అల్కరాజ్‌కి గ్రాస్ కోర్టులపై ఆడిన అనుభవం తక్కువైనప్పటికీ, గత నెలలో క్వీన్స్ కప్ గెలిచి ఆత్మవిశ్వాసంతో ఉన్నాడు. క్వార్టర్స్‌లో 21-యేళ్ల టెన్నిస్ సంచలనం, డానిష్ ప్లేయర్ హోల్గర్ రూన్‌తో తలపడననున్నాడు.
Up close with @carlosalcaraz for the winning moment 🎥#Wimbledon pic.twitter.com/5YIpUQqHaq
— Wimbledon (@Wimbledon) July 10, 2023
మరో మ్యాచ్‌లో రెండవ ర్యాంక్ ఆటగాడు నొవాక్ జకోవిచ్ 7-6 (8/6), 7-6 (8/6), 5-7, 6-4 సెట్ల తేడాతో పోలిష్ ఆటగాడు హ్యూబర్ట్ హర్కాజ్‌పై గెలిచి వింబుల్డన్‌లో 14వ సారి క్వార్టర్ ఫైనల్ చేరాడు. ఆదివారం మ్యాచ్‌ని ఆపే సమయానికి 2 సెట్ల ఆధిక్యంలో ఉన్న జకోని, సోమవారం మళ్లీ ప్రారంభమైన మ్యాచ్‌లో 4వ సెట్‌ని 6-4తో గెలిచి టోర్నీలో ముందుకెళ్లాడు. వింబుల్డన్ టోర్నీలో తాను ఆడిన 100 మ్యాచుల్లో 90వ విజయం సాధించాడు.
మూడో సీడ్, రష్యా ఆటగాడు మెద్వెదెవ్ 6-4, 6-2 తేడాతో చెక్ క్రీడాకారుడు లెహకాను ఓడించాడు.
మహిళల సింగిల్స్‌లో డిఫెండింగ్ ఛాంపియన్, కజకిస్థాన్ క్రీడాకారిణి రిబకీనా 4వ రౌండ్ దాటింటి. ప్రత్యర్థి క్రీడాకారిణి మ్యాచ్ 4-1గా రిబకీనా ఆధిక్యంలో ఉన్న సమయంలో, గాయంతో మెడికల్ టైమౌట్ తీసుకుని వెనుదిరగడంతో రిబకీనాను విజేతగా ప్రకటించారు.