2022 ఆస్ట్రేలియన్ ఓపెన్ సమయంలో తనపై విషప్రయోగం జరిగిందని టెన్నిస్ స్టార్ జకోవిచ్ సంచలన ఆరోపణలు చేశారు. మెల్‌బోర్న్ హోటల్‌లో తనకు ఆహారంలో విషం కలిపి పెట్టారని తెలిపారు. అనారోగ్యానికి గురికావడంతో వైద్య పరీక్షల్లో తన శరీరంలో మెర్‌క్యురీ ఉన్నట్లు తేలిందని చెప్పారు. కాగా జకోవిచ్ కొవిడ్ టీకా తీసుకోకపోవడంతో ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఆడనివ్వలేదు. ఆ సమయంలోనే విషప్రయోగం జరిగిందని తాజా ఇంటర్వ్యూలో ఆయన తెలిపారు. కాగా, కొవిడ్ వ్యాక్సిన్ వేసుకోని కారణంగా 2002లో ఆస్ట్రేలియా నుంచి జకోవిచ్‌ను డిపోర్ట్ చేశారు. అలాగే అతడి వీసాను రద్దు చేసి అతన్ని ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఆడకుండా వెనక్కి పంపించేశారు. అయితే ఆ ఏడాది జరిగిన ఘటన గురించి తాజాగా ఓ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలు వెల్లడించాడు.