Rohit Sharma : బంగ్లాదేశ్ ను లైట్ తీసుకోవద్దు.. రోహిత్ కు సూచించిన హర్బజన్, రైనా
సెప్టెంబర్ లో భారత్-బంగ్లాదేశ్ మధ్య రెండు టెస్టుల సిరీస్ జరగనుంది. ఈ క్రమంలో కెప్టెన్ రోహిత్ శర్మకు టీమిండియా మాజీ ప్లేయర్లు హర్బజన్, సురేశ్ రైనా సూచనలు చేశారు. టెస్ట్ సిరీస్‌లో బంగ్లా ఆటగాళ్లు భారత్‌ను దెబ్బతీసే అవకాశం ఉందని.. వారిని లైట్ గా తీసుకోవద్దని హెచ్చరించారు. ‘ఎన్ని రాజకీయ గందరగోళాలు ఉన్నప్పటికీ బంగ్లాదేశ్ తమ ఆత్మవిశ్వాసాన్ని మాత్రం కోల్పోదు. గతవారం రావల్పిండిలో జరిగిన తొలి టెస్ట్‌లోనే పాకిస్థాన్‌పై సంచలన విజయాన్ని నమోదు చేసింది. బంగ్లాదేశ్‌ను తేలికగా తీసుకునే అవకాశమే లేదు. ఎందుకంటే వారికి స్పిన్నర్స్‌తో పాటు ఎంతోకాలం నుంచి మంచి ప్రదర్శనలు ఇస్తున్న అనుభవం కలిగిన ఆటగాళ్లు ఉన్నారు. ఆస్ట్రేలియా పర్యటనకు ఈ సిరీస్ చక్కటి మ్యాచ్ ప్రాక్టీస్ అవుతుంది’అని రైనా, హర్బజన్ తెలిపారు.