నేపాల్ తో (Nepal) జరిగిన టీ20 మ్యాచ్లో నమీబియా బ్యాటర్ వీరవిధ్వంసం సృష్టించారు. జాన్ నికోల్ లాఫ్టీ- ఈటన్ (Jan Nicol Loftie-Eaton) ఇంటర్నేషనల్ మ్యాచ్లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసి చరిత్ర నెలకొల్పారు. కేవలం 33 బంతుల్లోనే 101 పరుగులు బాదారు. ఇందులో 11 ఫోర్లు, 8 సిక్సర్లు ఉన్నాయి. అతడితో పాటు కుర్గర్(59) హాఫ్ సెంచరీతో చెలరేగాడు. వీరిద్దరి విధ్వంసకర ఇన్నింగ్స్‌ల ఫలితంగా నమీబియా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది.
ప్రపంచంలోనే అత్యంత వేగంగా సెంచరీ సాధించిన తొలి బ్యాటర్ గా నికోల్ నిలిచారు. కుశాల్ మల్లా 34 బంతుల్లో, రోహిత్ శర్మ, డేవిడ్ మిల్లర్ 35 బంతుల్లో సెంచరీ చేశారు. గతేడాది జరిగిన ఆసియా క్రీడల్లో మంగోలియాపై కేవలం 34 బంతుల్లో మల్లా సెంచరీ చేశాడు.గతేడాది జరిగిన ఆసియా క్రీడల్లో మంగోలియాపై కేవలం 34 బంతుల్లో మల్లా సెంచరీ చేశాడు.
పొట్టి క్రికెట్‌లో నికొల్‌కు మంచి రికార్డు ఉంది. సుడిగాలి ఇన్నింగ్స్‌లతో విరుచుకుపడే ఈ లెఫ్ట్ హ్యాండర్ ఇప్పటివరకూ ఒక్క హాఫ్ సెంచరీ బాదలేదు. అలాంటిది నేపాల్‌పై నికొల్ చెలరేగిపోయాడు. దొరికిన బంతిని దొరికినట్టు స్టాండ్స్‌లోకి పంపాడు.