టీమ్ ఇండియా కోచ్ గంభీర్‌ది ఇప్పటికీ చిన్నపిల్లాడి మనస్తత్వమని చిన్ననాటి కోచ్ సంజయ్ భరద్వాజ్ వెల్లడించారు. కొందరు అతడిని అహంకారి అనుకుంటారని, కానీ గౌతీ ఏం చేసినా గెలుపు కోసమేనని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ‘గంభీర్‌ది గొప్ప మనసు. ఎంతో వినయంగా ఉంటారు. ఎంతో మంది యువకుల కెరీర్‌లను తీర్చిదిద్దారు’ అని చెప్పారు. చిన్నప్పుడు మ్యాచ్‌లు ఓడిపోతే ఏడ్చేవాడని, అతనికి ఓటమి ఇష్టం ఉండదని గుర్తుచేసుకున్నారు. తొలి వన్డేను టైగా ముగించిన భారత జట్టు.. రెండో వన్డేలో మాత్రం 32 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. కాగా రెండో వన్డేలో గంభీర్ తీసుకున్న నిర్ణయాల వల్లే భారత్ పరాజయం పాలైందని అభిమానులు విమర్శిస్తున్నారు. కేఎల్ రాహుల్ వంటి స్టార్ ఆటగాడిని ఏడో స్ధానంలో బ్యాటింగ్ పంపడాన్ని చాలా మంది మాజీలు తప్పబడుతున్నారు.