Bumrah : టీమ్ ఇండియాకు గుడ్ న్యూస్.. ఛాంపియన్స్ ట్రోఫీకి బుమ్రా ?

Update: 2025-01-18 07:15 GMT

భారత స్పీడ్ స్టార్ జస్ప్రీత్ బుమ్రా ఛాంపియన్స్ ట్రోఫీకి అందుబాటులో ఉంటారని తెలుస్తోంది. ఇటీవల గాయం కారణంగా ఛాంపియన్స్ ట్రోఫీకి దూరమవుతున్నారనే ప్రచారాన్ని ఆయన ఖండించిన సంగతి తెలిసిందే. మరోవైపు ఇంగ్లండ్‌తో సిరీస్‌కు మేనేజ్మెంట్ ఆయనకు విశ్రాంతి కల్పించింది. దీంతో ఇవాళ ప్రెస్ మీట్‌లో బుమ్రా ఆడే విషయమై రోహిత్ ఎలాంటి ప్రకటన చేస్తారని అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది.

అలాగే సంజూ శాంసన్ జ‌ట్టులో చోటు ద‌క్క‌క‌పోవ‌చ్చ‌ని, విజయ్ హజారే ట్రోఫీ (వీహెచ్‌టీ)లో సంచ‌ల‌న ప్ర‌ద‌ర్శ‌న‌తో ఆక‌ట్టుకుంటున్న‌ కరుణ్ నాయర్‌ను మాత్రం సెల‌క్ష‌న్ టీమ్ పరిగణనలోకి తీసుకునే అవ‌కాశం ఉంద‌ని పేర్కొంది. క‌రుణ్ నాయ‌ర్ వీహెచ్‌టీలో 8 మ్యాచ్‌ల్లో 752 పరుగులతో రాణించాడు. ఏడు ఇన్నింగ్స్‌ల్లో ఐదు సెంచరీలు చేశాడు. అయితే, "ఒక ప్రధాన టోర్నమెంట్‌కు ముందు 2017లో చివరిసారిగా భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన నాయర్‌ను రీకాల్ చేయడం మంచి నిర్ణ‌యం కాద‌ని సెలక్టర్లు భావిస్తున్నారని" క‌థ‌నం పేర్కొంది.

Tags:    

Similar News