Hardik Pandya : భువీ, బుమ్రాలను దాటేసిన హార్దిక్ పాండ్యా

Update: 2025-01-23 10:15 GMT

టీ20ల్లో భార‌త్ త‌ర‌ఫున అత్య‌ధిక వికెట్లు తీసిన బౌల‌ర్ల జాబితాలో పేస‌ర్లు భువనేశ్వర్ కుమార్, జ‌స్ప్రీత్ బుమ్రాల‌ను హార్దిక్ పాండ్యా దాటేశాడు. ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా బుధవారం ఈడెన్ గార్డెన్స్ లో జ‌రిగిన మొద‌టి మ్యాచ్‌లో పాండ్యా 2 వికెట్లు తీశాడు. దీంతో టీ20ల్లో అత‌ని మొత్తం వికెట్ల సంఖ్య 91కి చేరింది. ఈ క్ర‌మంలో భార‌త్ త‌ర‌ఫున అత్య‌ధిక వికెట్లు తీసిన భార‌త బౌల‌ర్ల‌ జాబితాలోని భువ‌నేశ్వ‌ర్ (90), బుమ్రా (89) ల‌ను అత‌ను అధిగ‌మించాడు. ఈ జాబితాలో అర్ష్‌దీప్ సింగ్ 97 వికెట్లతో అగ్ర‌ స్థానంలో ఉన్నాడు. రెండో స్థానంలో యుజ్వేంద్ర చాహల్ (96) ఉంటే.. 91 వికెట్ల‌తో పాండ్యా మూడో స్థానాన్ని ఆక్ర‌మించాడు. ఆ త‌ర్వాత వ‌రుస‌గా నాలుగు, ఐదో స్థానంలో భువ‌నేశ్వ‌ర్ (90), బుమ్రా (89) ఉన్నారు.

Tags:    

Similar News