Delhi Capitals : ఢిల్లీ క్యాపిటల్స్‌ హెడ్‌ కోచ్‌గా బదానీ

Update: 2024-10-18 04:45 GMT

ఢిల్లీ క్యాపిటల్స్‌ హెడ్‌ కోచ్‌గా టీమ్ఇండియా మాజీ క్రికెటర్ హేమంగ్ బదానీ బాధ్యతలు చేపట్టనున్నాడు. మరోవైపు, ఫ్రాంఛైజీ డైరెక్టర్ ఆఫ్‌ క్రికెట్‌గా భారత మాజీ ఆటగాడు వేణుగోపాల్ రావును ఢిల్లీ క్యాపిటల్స్ నియమించింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. ఏడేళ్లపాటు దిల్లీ హెడ్‌ కోచ్‌గా ఉన్న రికీ పాంటింగ్‌ను ఇటీవల తొలగించిన సంగతి తెలిసిందే. గత సీజన్‌ వరకు దిల్లీ ఫ్రాంఛైజీ డైరెక్టర్ ఆఫ్‌ క్రికెట్‌గా సౌరభ్‌ గంగూలీ కొనసాగాడు. తాజాగా అతడి స్థానంలో వేణుగోపాల్ రావుకు ఆ బాధ్యతలు అప్పగించారు.

Tags:    

Similar News