విశ్వక్రీడల్లో పతకం సాధించిన తమ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఆయా దేశాలు, క్రీడా సంఘాలు భారీ నగదు పురస్కారాలు, బహుమతులు ప్రకటిస్తున్నాయి. అయితే క్రీడాకారులకు ఒలింపిక్స్ నిర్వహణ కమిటీ మెడల్ తప్పించి ఒక్క రూపాయి కూడా ఇవ్వదు. కొన్ని దేశాలూ తమ క్రీడాకారులకు ఎలాంటి బహుమతులు అందించవు. వీటిలో మొరాకో, ఇటలీ, ఫిలిప్పీన్స్, హంగేరీ, కొసావో, ఈజిప్ట్, నార్వే, స్వీడన్, బ్రిటన్ దేశాలున్నాయి.
✮భారత్: బంగారు పతక విజేతకు రూ.75 లక్షలు, రజత పతకం రూ.50 లక్షలు, కాంస్య పతకం రూ.10 లక్షలిస్తుంది. గోల్డ్ మెడల్ విన్నర్‌కు IOA లక్షా 20 వేల డాలర్లు ఇస్తుంది
✮సింగపూర్: గోల్డ్ మెడల్ విజేతకు 7,44,000 డాలర్లు, సిల్వర్ మెడల్: $3,72,000, కాంస్య పతకం $186000
✮సౌదీ అరేబియా 2021 రజత పతక విజేతకు 1.33మిలియన్ డాలర్లు ఇచ్చింది
✮రష్యా: 45,300 డాలర్ల ప్రైజ్ మనీ.