ROHIT: ఒక్క ఏడాది.. 50 రికార్డులు.. రో"హిట్"

రోహిత్‌కు కలిసొచ్చిన 2025...50 రికార్డులు నెలకొల్పిన హిట్‌మ్యాన్... అత్యధిక సిక్సులు బాదిన బ్యాటర్

Update: 2025-12-30 04:45 GMT

క్రి­కె­ట్ చరి­త్ర­లో కొ­న్ని సం­వ­త్స­రా­లు ఆట­గా­ళ్ల­ను లె­జెం­డ్స్‌­గా మలు­స్తా­యి. 2025 అలాం­టి సం­వ­త్స­ర­మే. రో­హి­త్ శర్మ కె­రీ­ర్‌­లో స్వ­ర్ణా­క్ష­రా­ల­తో లి­ఖిం­చా­ల్సిన అధ్యా­యం 2025. కె­ప్టె­న్‌­గా, బ్యా­ట్స్‌­మ­న్‌­గా, నా­య­కు­డి­గా… ప్ర­తి పా­త్ర­లో­నూ రో­హి­త్ తన ము­ద్ర­ను గట్టి­గా వే­శా­డు. అతడి కె­ప్టె­న్సీ­లో భా­ర­త్ మరో­సా­రి ప్ర­పంచ క్రి­కె­ట్ శి­ఖ­రా­న్ని అధి­రో­హిం­చిం­ది. ఛాం­పి­య­న్స్ ట్రో­ఫీ ఫై­న­ల్‌­లో న్యూ­జి­లాం­డ్ వంటి బల­మైన జట్టు­ను ఎదు­ర్కొ­న్న వేళ, ఒత్తి­డి­ని అవ­కా­శం­గా మా­ర్చు­కు­న్నా­డు రో­హి­త్. మ్యా­చ్ ని­ర్ణా­యక క్ష­ణా­ల్లో ఆడిన 76 పరు­గుల క్లా­స్ ఇన్నిం­గ్స్ అతడి అను­భ­వా­ని­కి, ప్ర­శాం­త­త­కు ని­లు­వె­త్తు ఉదా­హ­ర­ణ­గా ని­లి­చిం­ది. అదే ఇన్నిం­గ్స్ అత­ని­కి ప్లే­య­ర్ ఆఫ్ ది మ్యా­చ్ అవా­ర్డు­ను కూడా అం­దిం­చిం­ది. 2025 సం­వ­త్స­రం మొ­త్తం రో­హి­త్ శర్మ పేరు వెంట పరు­గు­లు, రి­కా­ర్డు­లు పరు­గు తీ­శా­యి. 50కి పైగా రి­కా­ర్డు­లు... కొ­న్ని వ్య­క్తి­గ­త­మై­న­వి, మరి­కొ­న్ని జట్టు వి­జ­యా­ల­కు బా­ట­లు వే­సి­న­వి. ఓపె­న­ర్‌­గా కొ­త్త ప్ర­మా­ణా­లు, కె­ప్టె­న్‌­గా కొ­త్త దా­రు­లు చూ­పిం­చిన ఈ ఏడా­ది, రో­హి­త్ శర్మ­ను కే­వ­లం ఒక స్టా­ర్‌­గా కాదు…భారత క్రి­కె­ట్ యు­గా­ని­కి ప్ర­తీ­క­గా ని­లి­పిం­ది.

అత్యధిక వన్డే సిక్స్‌లు

రో­హి­త్ శర్మ ఈ ఏడా­ది షా­హి­ద్ అఫ్రి­ది పే­రిట ఉన్న ఒక పె­ద్ద రి­కా­ర్డు­ను బద్ద­లు కొ­ట్టా­డు. పా­కి­స్థా­న్ బ్యా­ట్స్‌­మె­న్ గత 10 సం­వ­త్స­రా­లు­గా ఆధి­ప­త్యం చె­లా­యి­స్తు­న్నా­డు. వన్డే­ల్లో అత్య­ధిక సి­క్స్‌­లు కొ­ట్టిన బ్యా­ట్స్‌­మె­న్‌­గా రో­హి­త్ ని­లి­చా­డు. రో­హి­త్ ఖా­తా­లో ప్ర­స్తు­తం 355 వన్డే సి­క్స్‌­లు ఉన్నా­యి. అఫ్రి­ది 351 సి­క్స్‌­లు కొ­ట్టా­డు. రోహిత్ అంటే సిక్సర్ల కింగ్ అని మరోసారి ప్రపంచానికి చాటి చెప్పిన ఏడాది 2025. ఎన్నో జ్ఞాపకాలను అభిమానులకు మిగిల్చింది.

రికార్డులే రికార్డులు

రో­హి­త్ శర్మ సేనా దే­శా­ల­లో (దక్షి­ణా­ఫ్రి­కా, ఇం­గ్లాం­డ్, న్యూ­జి­లాం­డ్, ఆస్ట్రే­లి­యా) అత్య­ధిక సెం­చ­రీ­లు చే­సిన బ్యా­ట్స్‌­మె­న్‌­గా ని­లి­చా­డు. అతను మొ­త్తం 14 వన్డే సెం­చ­రీ­లు సా­ధిం­చా­డు. అం­తే­కాక.. భా­ర­త్ తర­పున అత్య­ధిక పరు­గు­లు చే­సిన ఓపె­న­ర్ (15,933).. ఓపె­న­ర్‌­గా భా­ర­త్ తర­పున సం­యు­క్తం­గా అత్య­ధిక సెం­చ­రీ­లు (45). సచి­న్ సైతం ఓపె­న­ర్‌­గా ఇదే రి­కా­ర్డ్ కూడా నె­ల­కొ­ల్పా­డు. కె­ప్టె­న్‌­గా ICC టో­ర్న­మెం­ట్‌­ల­లో సం­యు­క్తం­గా అత్య­ధి­కం­గా నా­లు­గు సా­ర్లు మ్యా­న్ ఆఫ్ ది మ్యా­చు­లు గె­లు­చు­కు­న్న ప్లే­య­ర్ గా రి­కా­ర్డు నె­ల­కొ­ల్పా­డు. భా­ర­త్ తర­పున సం­యు­క్తం­గా అత్య­ధిక (4) ICC ట్రో­ఫీ­లు గె­లు­చు­కు­న్నా­డు రో­హి­త్ శర్మ. ICC వన్డే­ల్లో కె­ప్టె­న్‌­గా 93.8 శాతం విజయ శా­తం­తో చరి­త్ర సృ­ష్టిం­చ­డ­మే కాక, భా­ర­త్ తర­పున కె­ప్టె­న్‌­గా ODI­ల్లో అత్య­ధిక సి­క్స్‌­లు (126) బా­దిన ఆట­గా­డి­గా ని­లి­చా­డు. 38 ఏళ్ల వయ­సు­లో­నే ODI­ల్లో ప్లే­య­ర్ ఆఫ్ ది సి­రీ­స్, ప్లే­య­ర్ ఆఫ్ ది మ్యా­చ్ అవా­ర్డు­లు గె­లు­చు­కు­న్న అత్య­ధిక వయ­సు­న్న భా­ర­తీ­యు­డి­గా రి­కా­ర్డు నె­ల­కొ­ల్పా­డు. వి­దే­శీ బ్యా­ట్స్‌­మ­న్‌­గా ఆస్ట్రే­లి­యా­లో అత్య­ధిక ODI సెం­చ­రీ­లు (6) చే­సిన ఘన­త­తో పాటు, అక్క­డే 1530 పరు­గు­లు చేసి అత్య­ధిక ODI పరు­గు­లు చే­సిన భా­ర­తీ­యు­డి­గా ని­లి­చా­డు. ఆస్ట్రే­లి­యా­లో ODI సెం­చ­రీ చే­సిన అధిక వయ­సు­న్న ఆసి­యా క్రి­కె­ట­ర్, వి­దే­శా­ల్లో ODI సెం­చ­రీ చే­సిన అధిక వయ­సు­న్న భా­ర­తీ­యు­డు­గా­నూ రి­కా­ర్డుల జా­బి­తా­లో­కి చే­రా­డు.

Tags:    

Similar News