టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సంచలన నిర్ణయం తీ సుకున్నారు. ఇంటర్నేషనల్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా బ్రిస్బేన్ లో జరిగిన మూడవ టెస్టు చివరిరో జు తాను ఆటకు వీడ్కోలు చెప్తున్నట్టు అశ్విన్ చెప్పాడు. టెస్టు కెరీర్ లో అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్ గా అశ్విన్ రికార్డ్ క్రియేట్ చేశాడు. తన కెరీర్ లో 107 టెస్టుల్లో 537 వికెట్లు, 3503 పరుగులు సాధించాడు. మొత్తంగా తన ఇంటర్నేషనల్ క్రికెట్ కెరీర్ లో 116 వన్డేలు, 65 టీ 20లు, 106 టెస్టులు ఆడాడు. ఓవరాల్ గా 765 వికెట్లు, 4400 పరుగులు రా బట్టాడు. క్రికెట్ కు రిటైర్మెంట్ ఇచ్చిన అశ్విన్ రేపు భారత్ కు రా నున్నాడు. ఈ మేరకు కెప్టెన్ రోహిత్ శర్మ వివరాలు తెలిపాడు. "భారత్ తరపున ఆడినందుకు గర్వంగా భావిస్తున్నా. ఇప్పుడు టైమ్ వచ్చిందనుకున్నా. కెరీర్ లో ఎన్నో పరుగులు, వికెట్లు సాధించా. భారత క్రికెట్ లో నా భాగస్వామ్యం ఉండటం ఆనందంగా ఉంది" అని అశ్విన్ తెలిపాడు.