Cricket : రోహిత్ టాలెంట్‌ విషయంలో నేనూ పొరపడ్డా..: చిన్ననాటి కోచ్ దినేశ్‌ లాడ్

Update: 2025-08-11 08:15 GMT

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చిన్ననాటి కోచ్ దినేశ్‌ లాడ్, రోహిత్ టాలెంట్ విషయంలో తాను మొదట పొరబడ్డానని అంగీకరించారు. తాను మొదట రోహిత్‌ను ఒక బౌలర్‌గా చూశానని, బ్యాటర్‌గా అతనిలో ఉన్న ప్రతిభను గుర్తించలేకపోయానని ఇటీవల ఒక పోడ్‌కాస్ట్‌లో తెలిపారు. రోహిత్ తన దగ్గరకు వచ్చినప్పుడు కేవలం 12 ఏళ్ల వయసు. లాడ్ అతడిని మొదట ఒక ఆఫ్‌స్పిన్నర్‌గా గుర్తించారు. రోహిత్‌లో బౌలింగ్ టాలెంట్ ఉందని భావించి, ఎక్కువగా బౌలింగ్‌పైనే దృష్టి పెట్టించారు. ఒకరోజు ప్రాక్టీస్‌లో రోహిత్ బ్యాటింగ్ చేస్తుండగా, దూరం నుంచి గమనించిన లాడ్‌.. అతని బ్యాట్ చాలా స్ట్రెయిట్‌గా వస్తున్న తీరుకు ఆశ్చర్యపోయారు. అప్పుడే రోహిత్‌లో అద్భుతమైన బ్యాటింగ్ టాలెంట్ ఉందని గ్రహించారు. తాను మొదట రోహిత్‌కు బ్యాటింగ్ ప్రాక్టీస్ ఇవ్వకపోవడం తన పొరపాటే అని ఒప్పుకున్నారు. ఆ తర్వాత ఒక మ్యాచ్‌లో రోహిత్‌ను ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు పంపగా, అతను అద్భుతమైన 40 పరుగులు చేశాడు. దీంతో రోహిత్‌ను ఓపెనర్‌గా పంపాలని లాడ్ నిర్ణయించుకున్నారు. ఓపెనర్‌గా పంపిన తొలి మ్యాచ్‌లోనే రోహిత్ ఏకంగా 140 పరుగులు చేసి తన సత్తా చాటుకున్నాడు. ఈ సంఘటనల తర్వాత రోహిత్ బ్యాటింగ్‌పై ఎక్కువగా దృష్టి పెట్టారని, ఇప్పుడు ప్రపంచంలోని అత్యుత్తమ ఓపెనర్లలో ఒకరిగా ఎదిగారని దినేశ్‌ లాడ్ చెప్పారు.

Tags:    

Similar News