ఐసీసీ తాజాగా టీ 20 ర్యాం కింగ్స్ విడుదుల చేసింది. ఇందులో టీమిండియా యువ ప్లేయర్, తెలుగు తేజం తిలక్ వర్మ సత్తా చాటాడు. తాజా ర్యాంకింగ్స్ లో ఏకంగా 69 స్థానాలు ఎగబాకి టాప్ 3 లోకి చేరుకున్నాడు. టీ20 బ్యాట్స్ మెన్స్ ర్యాంకింగ్స్ లో తిలక్ వర్మ టాప్ 10 లోకి రావడం ఇదే తొలిసారి. కాగా ఇటీవల సౌతాఫ్రికా తో జరిగిన నాలుగు మ్యాచ్ ల టీ 20 సిరీస్ ను టీమిండియా 31 తేడాతో గెలుచుకుంది. ఈ సిరీస్ లో తిలక్ వర్మ 280 పరుగులు సాధించాడు. ఇందులో రెండు సెంచరీలు నమోదుకా వడం విశేషం. ఇక టీ 20 ఆల్ రౌండర్ ప్లేయర్ లిస్ట్ లో హార్దిక్ పాండ్యాలో టాప్ లోకి దూసుకొచ్చాడు. సౌతాఫ్రికాతో జరిగిన టీ 20 సిరీస్ లో హార్దిక్ పాండ్యా బ్యాట్ తో పాటు బౌలింగ్ లోనూ అద్భుత ప్రదర్శన చేశాడు. దీంతో తాజా ర్యాంకింగ్స్ లో ఇంగ్లాండ్ ప్లేయర్ లియామ్ లివింగ్ స్టోన్ ను వెనక్కి నెట్టి నెం. 1 ర్యాంక్ సాధించాడు.