ఐసీసీ ఉమెన్స్ U19 టీ20 వరల్డ్ కప్ సూపర్ 6లో భాగంగా స్కాట్లాండ్‌తో మ్యాచులో భారత్ 150 రన్స్ తేడాతో గెలిచింది. మొదట ఇండియా 20 ఓవర్లలో 208/1 స్కోర్ చేయగా, స్కాట్లాండ్ 58 పరుగులకే ఆలౌటైంది. తెలుగమ్మాయి గొంగడి త్రిష 110 రన్స్ చేయడంతో పాటు 3 వికెట్లు తీసి అద్భుతంగా రాణించారు. కమలిని 51 రన్స్ చేయగా ఆయుషి శుక్లా 4, వైష్ణవి శర్మ 3 వికెట్లతో అదరగొట్టారు.
తెలంగాణలోని ఖమ్మంకు చెందిన గొంగడి త్రిష U19 టీ 20 వరల్డ్ కప్ లో సెంచరీతో విధ్వంసం సృష్టించిన విషయం తెలిసిందే. 59 బంతుల్లోనే 110 రన్స్ చేసి నాటౌట్‌గా నిలిచారు. ఈ క్రమంలో మహిళల U19 టీ 20 వరల్డ్ కప్ లో తొలి సెంచరీ చేసిన ప్లేయర్‌గా రికార్డు సృష్టించారు. ఉమెన్స్ వన్డే వరల్డ్ కప్ లో తొలి సెంచరీ ఇంగ్లండ్ ప్లేయర్ లిన్ థామస్(1973) నమోదు చేశారు. టీ20 వరల్డ్ కప్ లో మొదటి సెంచరీ వెస్టిండీస్ బ్యాటర్ డియాండ్రా డాటిన్(2010) పేరిట ఉంది.