ఏషియన్ చాంపియన్స్ ట్రోఫీ హాకీలో ఇండియా హవా కొనసాగుతున్నది. ఇప్పటికే వరుసగా మూడు విజయాలు సాధించిన భారత్.. గురువారం 3-1తో సౌత్ కొరియాను ఓడించి సెమీఫైనల్లో అడుగుపెట్టింది. భారత్ తరఫున అరైజీత్ సింగ్ (8వ నిమిషం), కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ (9వ నిమిషం, 43వ నిమిషం) గోల్స్ చేశారు. సౌత్ కొరియా తరఫున నమోదైన ఏకైక గోల్‌ను జిహున్ యాంగ్ (30వ నిమిషం) సాధించాడు. భారత్ శనివారం జరిగే చివరి గ్రూప్ మ్యాచ్‌లో పాకిస్థాన్‌తో ఆడనుంది. అంతకుముందు భారత్ 3-0తో చైనాను, 5-1తో జపాన్‌ను, 8-1తో మలేషియాను ఓడించింది. ఆరు జట్లు పోటీపడుతోన్న ఈ టోర్నీ రౌండ్ రాబిన్ ఫార్మాట్లో జరుగుతోంది. తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీస్‌లో అడుగుపెడతాయి