Kohli and Rohit : లంకతో వన్డే సిరీస్‌కు ఊపు.. ప్రాక్టీస్ చేస్తున్న కోహ్లీ, రోహిత్
టీమిండియా.. శ్రీలంక పర్యటనకు ఊపు వచ్చింది. స్టార్లు రంగంలోకి దిగారు. కింగ్ విరాట్ కోహ్లి ( Virat Kohli ), కెప్టెన్ రోహిత్ ( Rohit Sharma ) టీమ్ తో జాయిన్ అయ్యారు. శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న మూడు వన్డేల సిరీస్ కోసం లంక గడ్డపై అడుగుపెట్టారు. టీ20 ప్రపంచకప్ 2024 విజయానం తరం విశ్రాంతి తీసుకున్న ఈ స్టార్ ఆటగాళ్లు.. రీఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యారు.
సరిగ్గా నెల రోజుల క్రితం ఇదే రోజు టీమిండియా విశ్వవిజేతగా నిలిచింది. సౌతాఫ్రికా తో జరిగిన టీ20 ప్రపంచకప్ ఫైనల్లో ఆఖరి ఓవర్లో సూర్య కుమార్ యాదవ్ స్టన్నింగ్ క్యాచ్ తో విజయాన్నందుకున్న టీమిండియా 11 ఏళ్ల ఐసీసీ టైటిల్ నిరీక్షణకు తెరదించింది. ఈ విజయానంతరం రోహిత్ శర్మ కుటుంబంతో కలిసి అమెరికా వెళ్లగా.. విరాట్ కోహ్లి తన ఫ్యామిలీతో లండన్లో గడిపాడు. టీ20 ప్రపంచకప్ విజయంతో ఈ ఇద్దరూ అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలికారు.
ఈ ఇద్దరు స్టార్ ఆటగాళ్లు శ్రీలంకతో వన్డే సిరీస్ కు రెడీ అయ్యారు. ప్రాక్టీస్ సెషన్లో కోహ్లి, రోహితో పాటు కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్లు కూడా పాల్గొంటున్నారు. నయా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పర్యవేక్షణలో ఈ స్టార్ ఆటగాళ్లు ఎలా ఆడుతారు? వారిని అతను ఎలా ట్రీట్ చేస్తాడు? అనే ఆసక్తి అందరిలో నెలకొంది.