ఐపీఎల్ - 2025 మెగా వేలం ఉత్కంఠగా కొనసాగుతోంది. లీగ్ చరిత్రలోనే అత్యధిక ధరలు మొదటివేలంలో నమోదు కాగా రెండోరోజు కూడా అన్ని ఫ్రాంచైజీలు ఆటగాళ్లను కొనుగోలు చేసేందుకు పోటీ పడుతున్నాయి. రెండో రోజు భారత స్టార్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ ను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టీమ్ రూ. 10.75 కోట్లకు దక్కించుకుంది. గత 11 సీజన్లుగా హైదరాబాద్ తరఫున ఆడుతున్న ఈ ప్లేయర్ను మెగా వేలానికి ముందు టీమ్ వదిలేసింది. భారత ఆటగాళ్లు అజింక్య రహానె, పృథ్వీషా, మయాంక్ అగర్వాల్, ఆల్ రౌండర్ శార్దూల్ ఠాకూర్, వికెట్ కీపర్ కేఎస్ భరత్, సౌతాఫ్రికా వికెట్ కీపర్ డొనావన్ ఫెరీరా, అఫ్ఘానిస్థాన్ స్పిన్నర్ ముజీబుర్ రెహ్మాన్, అలెక్స్ కేరీ, ఆదిల్ రషీద్, కేశప్ మహరాజ్, విజయ్ కాంత్ వియస్కాంత్, అకీలా హోస్సేన్, షై హోప్, డారిల్ మిచెల్, న్యూజిలాండ్ ఆటగాళ్లు కేన్ విలియమ్సన్, గ్లెన్ ఫిలిప్స్, స్వస్తిక్ చికారా, మాధవ్ కౌశిక్, పుఖ్ రాజ్ మన్, మయాంక్ దగార్, అనుకుల్ రాయ్, అవనీశ్ అరవెల్లి, వానీశ్ బేడీ అన్ సోల్డ్ గా మిగిలారు.