IPL: చెన్నైకు సంజు.. రాజస్థాన్‌కు జడేజా..!
ఐపీఎల్ చరిత్రలోనే భారీ ట్రేడ్ డీల్..!... రాజస్థాన్ రాయల్స్ భారీ మాస్టర్ ప్లాన్... చెన్నై కెప్టెన్‌గా సంజు శాంసన్... రాజస్థాన్ జట్టులోకి రవీంద్ర జడేజా.!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలోనే అత్యంత భారీ ట్రేడ్ డీల్స్‌లో ఒకదానికి రంగం సిద్ధమవుతోంది. చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే), రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) మధ్య జరగనున్న ఈ మార్పిడిలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ చెన్నైకి రానుండగా, స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా రాజస్థాన్‌కు వెళ్లనున్నాడు. అయితే, ఈ డీల్‌లో ఒకే ఒక్క మెలిక ఉండటంతో చర్చలు కొలిక్కి రావడం లేదు.
ఏడేళ్ల బంధం తెగినట్లేనా..
ఏడేళ్లుగా రాజస్థాన్ రాయల్స్‌తో ఉన్న బంధాన్ని తెంచుకోవాలని సంజూ శాంసన్ నిర్ణయించుకున్నాడు. ఈ విషయాన్ని ఫ్రాంచైజీకి స్పష్టం చేయడంతో, అతడిని ట్రేడ్ చేసేందుకు రాజస్థాన్ సిద్ధమైంది. గత కొన్ని నెలలుగా తెరవెనుక చర్చలు జరుపుతున్న చెన్నై సూపర్ కింగ్స్, సంజూను తమ జట్టులోకి తీసుకునేందుకు ఆసక్తి చూపింది. దీనికి బదులుగా ఇద్దరు ఆటగాళ్లను ఇచ్చేందుకు ముందుకొచ్చింది. వారిలో ఒకరు రవీంద్ర జడేజా కాగా, మరొకరు ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ సామ్ కర్రన్. అయితే రాజస్థాన్ రాయల్స్.. జడేజా విషయంలో సంతృప్తిగా ఉన్నప్పటికీ, సామ్ కర్రన్‌ను తీసుకునేందుకు ఆసక్తి చూపడం లేదు. జడేజాతో పాటు శ్రీలంక యువ పేసర్ మతీశ పతిరనను తమకు ఇవ్వాలని పట్టుబడుతోంది. కానీ, భవిష్యత్ స్టార్‌గా భావిస్తున్న పతిరనను వదులుకునేందుకు చెన్నై యాజమాన్యం ఏమాత్రం సిద్ధంగా లేదు. దీంతో ఈ డీల్ ప్రస్తుతం ముందుకు సాగడం లేదు. సంజూ శాంసన్ కోసం సీఎస్కే.. రాజస్థాన్ రాయల్స్‌తో జరుపుతున్న చర్చలు తుది దశకు చేరుకున్నాయి. ట్రేడింగ్ డీల్ చివరి దశలో ఉందని, త్వరలోనే ఫ్రాంచైజీల నుంచి దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని సమాచారం.
గతంలోనూ చర్చలు...
గతంలో, ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ ట్రిస్టన్ స్టబ్స్‌కు బదులుగా సంజు సామ్సన్ను కొనుగోలు చేయడానికి ముందుకొచ్చింది. ట్రేడింగ్ ప్రక్రియ చివరి దశకు చేరుకున్నందున, చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ జడేజా కోసం రాజస్థాన్ రాయల్స్‌కు స్వాప్ ఒప్పందాన్ని ప్రతిపాదించింది.రవీంద్ర జడేజా, సంజు సామ్సన్ చెరో 18 కోట్లు సంపాదిస్తున్న ఆటగాళ్ళు. వీరిద్దరినీ ఇచ్చిపుచ్చుకునేందుకు రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీకి సీఎస్కే ఆఫర్ ఇచ్చిందని క్రిక్ బజ్ నివేదించింది. కానీ, రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ డెవాల్డ్ బ్రెవిస్‌తో పాటు రవీంద్ర జడేజాను కూడా డిమాండ్ చేసినట్లు తెలిసింది. అంటే జడేజా, బ్రెవిస్ లను ఇస్తే సంజు సామ్సన్ను వదులుకుంటామని ఆర్ఆర్ ఫ్రాంచైజీ చెప్పిందని తెలిసింది. ఈ డిమాండ్ ఉన్నప్పటికీ, చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ రవీంద్ర జడేజాను మాత్రమే మార్చుకోవాలనే వైఖరిలో దృఢంగా ఉంది. బంతి ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ కోర్టులో ఉంది. రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజ్ జడేజా కోసం స్వాప్ ఒప్పందానికి అంగీకరిస్తే, సంజు సామ్సన్ వచ్చే సీజన్లో చెన్నై తరపున ఆడటం ఖాయం. అలాగే రవీంద్ర జడేజాతో పాటు యంగ్ బ్యాటర్ డేవాల్డ్ బ్రేవిస్‌ని కూడా ఇవ్వాలని డిమాండ్ చేస్తోందట. మరి ఈసారి అయినా ఢీల్ ఫినిష్ అవుతుందో లేదో ఈ వారంలో తేలిపోనుంది.