JADEJA: "రాయల్స్‌కు తిరిగి రావడం ఎంతో ప్రత్యేకం"

కీలక వ్యాఖ్యలు చేసిన రవీంద్ర జడేజా

Update: 2025-11-15 09:45 GMT

రా­జ­స్థా­న్ రా­య­ల్స్ జట్టు­లో చే­ర­డం­పై రవీం­ద్ర జడే­జా స్పం­దిం­చా­రు. “రా­య­ల్స్ నాకు మొ­ద­టి అవ­కా­శం ఇచ్చిన జట్టు. నా కె­రీ­ర్‌­లో తొలి వి­జ­యా­న్ని అం­దిం­చిన వే­దిక ఇదే. ఇప్పు­డు తి­రి­గి రా­వ­డం నాకు ప్ర­త్యే­కం­గా అని­పి­స్తుం­ది. ఇది నాకు కే­వ­లం జట్టు మా­త్ర­మే కాదు. నా ఇల్లు లాం­టి­ది,” అని జడే­జా భా­వో­ద్వే­గం­గా తె­లి­పా­రు.“జడే­జా మళ్లీ రా­య­ల్స్ జె­ర్సీ తొ­డ­గ­డం మా కోసం చాలా ప్ర­త్యే­కం. ఆయన ఈ ఫ్రాం­చై­జీ­ని, అభి­మా­ను­ల­ను బాగా అర్థం చే­సు­కుం­టా­డు. సామ్ (కరన్) కూడా బ్యా­ట్, బంతి రెం­డు చే­తు­ల్లో­నూ ఒత్తి­డి­ని తట్టు­కు­ని ఆడే ఆట­గా­డు. ఈ ఇద్ద­రూ కలి­సి జట్టు­కు సమ­తు­ల్యత, నా­య­క­త్వం, మ్యా­చ్ గె­లి­పిం­చే శక్తి­ని అం­ది­స్తా­రు” అని ఈ సం­ద­ర్భం­గా సం­గ­క్కర వ్యా­ఖ్యా­నిం­చా­రు.

నిరాశే కానీ తప్పలేదు"

జడే­జా చె­న్నై జట్టు­ను వీ­డ­నుం­డ­టం­పై ఆ ఫ్రాం­ఛై­జీ సీఈఓ కా­శీ­వి­శ్వ­నా­థ­న్‌ మా­ట్లా­డా­రు. ‘జట్టు­కు టా­ప్‌ ఆర్డ­ర్‌ ఇం­డి­య­న్‌ బ్యా­ట­ర్‌ కా­వా­ల­ని చె­న్నై యా­జ­మా­న్యం కో­రు­కుం­ది. కానీ ఆక్ష­న్‌­లో ఎక్కు­వ­మం­ది భారత బ్యా­ట­ర్లు లేరు. దీం­తో ట్రే­డ్‌ ద్వా­రా సొం­తం చే­సు­కో­వా­ల­ను­కు­న్నాం. కొ­న్ని సం­వ­త్స­రా­లు­గా చె­న్నై సూ­ప­ర్‌­కిం­గ్స్‌ వి­జ­యా­ల్లో కీలక పా­త్ర పో­షి­స్తూ వస్తో­న్న రవీం­ద్ర జడే­జా­ను వదు­లు­కో­వ­డం ని­జం­గా కఠి­న­మైన ని­ర్ణ­యం’ అని కా­శీ­వి­శ్వ­నా­థ­న్‌ అభి­ప్రా­య­ప­డ్డా­రు. ఇది తమను బా­ధిం­చిం­ద­ని తె­లి­పా­రు.

చ‌రిత్ర సృష్టించిన రిష‌బ్ పంత్

దక్షి­ణా­ఫ్రి­కా­తో జ‌­ర­‌­గ­‌­ను­న్న తొలి టె­స్టు­లో రి­ష­బ్ పంత్ చరి­త్ర సృ­ష్టిం­చా­డు. టె­స్టు­ల్లో అత్య­‌­ధిక సి­క్స­‌­ర్లు (91) కొ­ట్టిన భా­ర­‌త ప్లే­య­‌­ర్‌ ని­లి­చా­డు. దీం­తో వీ­రేం­ద్ర సె­హ్వా­గ్‌ పే­రు­మీద ఉన్న అత్య­ధిక సి­క్స­ర్ల (90) రి­కా­ర్డు బ్రే­క్ అయ్యిం­ది. వీ­రేం­ద్ర 103 టె­స్టు­ల్లో 90 సి­క్స­‌­ర్లు కొ­డి­తే... పంత్ 42 టె­స్టు­ల్లో­నే 91 సి­క్స­‌­ర్లు బా­దే­శా­డు. వీ­రి­ద్ద­రి తరు­వాత రో­హి­త్ శ‌­ర్మ 88, ర‌­వీం­ద్ర జ‌­డే­జా 80, ఎం­ఎ­స్ ధోని 78 సి­క­ర్ల­తో ఉన్నా­రు. ఎముక వి­ర­గ­డం­తో అతడు నా­లు­గు నెలల పాటు ఆటకు దూ­ర­మ­య్యా­డు. గాయం నుం­చి కో­లు­కు­ని టె­స్ట్ ఆడు­తు­న్నా­డు.

Tags:    

Similar News