ఆస్ట్రేలియా బ్యాటర్ మార్నస్ లబుషేన్ వన్డేల నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. భారత్‌తో జరిగిన 2023 WC ఫైనల్‌లో తాను వినియోగించిన బ్యాట్ ఫొటోను సోషల్ మీడియాలో పంచుకుంటూ ‘ఎట్టకేలకు ప్రపంచ కప్ ఫైనల్ బ్యాట్‌ని విరమించుకునే సమయం వచ్చిందని అనుకోండి’ అని రాసుకొచ్చారు. అయితే అతడు కేవలం బ్యాటుకే గుడ్ బై చెబుతున్నారా? లేక తానే రిటైర్ అవుతున్నారా అనే సందేహం నెలకొంది. మార్నస్ ఆ ఫైనల్‌లో 58రన్స్ చేశారు.