Hockey Player Dr. Vess Paes : లియాండర్‌ పేస్‌కు పితృ వియోగం

Update: 2025-08-14 12:00 GMT

టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ తండ్రి, మాజీ హాకీ క్రీడాకారుడు డాక్టర్ వేస్ పేస్ గురువారం (ఆగస్టు 14, 2025) కన్నుమూశారు. ఆయన వయసు 80 సంవత్సరాలు. గత కొంతకాలంగా పార్కిన్సన్ వ్యాధితో బాధపడుతున్న వేస్ పేస్ కోల్‌కతాలోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. వేస్ పేస్ 1972 మ్యూనిచ్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం గెలిచిన భారత హాకీ జట్టులో సభ్యుడు. ఒక వైద్యుడిగా ఉంటూనే, హాకీ క్రీడాకారుడిగా దేశానికి సేవలందించారు. ఆయన హాకీ నుంచి రిటైర్ అయిన తర్వాత స్పోర్ట్స్ మెడిసిన్ డాక్టర్‌గా పలు క్రీడా సంస్థలకు సేవలు అందించారు. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (BCCI), ఆసియా క్రికెట్ కౌన్సిల్ వంటి సంస్థలకు వైద్య సలహాదారుగా పనిచేశారు. వేస్ పేస్ (హాకీలో) మరియు ఆయన కుమారుడు లియాండర్ పేస్ (టెన్నిస్‌లో) ఒలింపిక్ పతకాలు సాధించిన అరుదైన తండ్రీకొడుకులుగా రికార్డు సృష్టించారు. ఈ విషాద వార్తతో క్రీడా లోకంలో తీవ్ర విషాదం నెలకొంది. లియాండర్ పేస్ కుటుంబానికి పలువురు క్రీడా ప్రముఖులు, రాజకీయ నాయకులు సంతాపం తెలియజేశారు.

Tags:    

Similar News