సన్ రైజర్స్ మ్యాచ్ జరుగుతుందంటో పరుగుల సునామీ ఖాయం అని తేలిపోవడంతో అభిమానులంతా అలర్ట్ అయిపోయారు. మ్యాచ్ ను లైవ్ లో చూసేందుకు ఉప్పల్ స్టేడియం చుట్టూ చక్కర్లు కొడుతున్నారు అభిమానులు. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో SRH vs RCB ఐపీఎల్ మ్యాచ్ జరగనుంది.
ఈ మ్యాచ్ కోసం మెట్రో రైళ్లు నిర్ణీత సమయానికి మించి నడుస్తాయని హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (HMRL) ప్రకటించింది. ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో రేపు గురువారం సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మధ్య మ్యాచ్ జరగనుంది. అభిమానులను గమ్య స్థానాలకు చేర్చేందుకు చివరి రైలు 12:15 గంటలకు సంబంధిత టెర్మినల్ స్టేషన్ల నుండి బయలుదేరి వారి గమ్యస్థానాలకు చేరుకుంటుందని అధికారులు తెలిపారు.
అభిమానులకు ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవాలని మెట్రో కోరింది. 'హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో జరిగే ఐపీఎల్ మ్యాచ్ కోసం మాత్రమే ఉప్పల్, స్టేడియం, ఎన్‌జిఆర్‌ఐ మెట్రో స్టేషన్‌లలో షెడ్యూల్ అవర్స్‌కి మించి ప్రవేశానికి అనుమతి ఉంది. ఇతర స్టేషన్లలో కేవలం ఎగ్జిట్ మాత్రమే అందుబాటులో ఉంటాయి' అని హైదరాబాద్ మెట్రో రైలు విభాగం ఒక ప్రకటనలో తెలిపింది.