న్యూజిలాండ్ క్రికెట్ జట్టుకు కొత్త కెప్టెన్ నియమితులయ్యారు. మిచెల్ శాంట్నర్‌ను వన్డే, టీ20 కెప్టెన్‌గా నియమిస్తున్నట్లు కివీస్ క్రికెట్ బోర్డ్ ప్రకటించింది. ఇది తనకు దక్కిన గౌరవం అని శాంట్నర్ తెలిపారు. జాతీయ జట్టుకు ఆడాలని చిన్నప్పటి నుంచి కల కంటామని, కానీ సారథ్య బాధ్యతలు రావడం ప్రత్యేకమన్నారు. ఈ నెలాఖరున శ్రీలంకతో ప్రారంభం కానున్న సిరీస్‌తో శాంట్నర్ పూర్తి స్థాయి బాధ్యతలు తీసుకోనున్నారు.
ఇదిలా ఉంటే.. తాజాగా సొంతగడ్డపై ఇంగ్లాండ్ తో జరిగిన మూడవ టెస్ట్ లోనూ న్యూజిలాండ్ ఘన విజయం సాధించింది. తన కెరీర్ చివరి టెస్ట్ ఆడిన స్టార్ పేసర్ టీమ్ సౌధీకి న్యూజిలాండ్ జట్టు ఘన విజయంతో వీడ్కోలు పలికింది. ఈ గెలుపుతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్స్ టేబుల్ లో న్యూజిలాండ్ నాలుగో స్థానానికి చేరింది. ఓటమితో ఇంగ్లాండ్ ఆరవ ప్లేస్ కి పడిపోయింది. ఇక శ్రీలంక 5వ స్థానంలో కొనసాగుతుండగా.. టాప్ 3 లో సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా, భారత్ తలపడుతున్నాయి.