SHAMI: చంపేస్తామంటూ మహమ్మద్ షమీకి బెదిరింపులు

పోలీసులకు ఫిర్యాదు చేసిన షమీ సోదరుడు;

Update: 2025-05-06 04:00 GMT

టీమిండియా స్టార్ పేస్ బౌలర్ మహమ్మద్ షమీని చంపేస్తామంటూ బెదిరింపు మెయిల్ రావడం కలకలం రేపుతోంది. రూ. కోటి ఇవ్వకపోతే చంపేస్తామంటూ రాజ్‌పుత్ సింధార్ నుంచి షమీకి మెయిల్ ద్వారా బెదిరింపులు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. దీనిపై షమీ సోదరుడు హసీబ్ అహ్మద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఎఫ్ఐఆర్ దాఖలు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.ఇటీవలే టీమిండియా కోచ్ గౌతం గంభీర్ కు కూడా బెదిరింపులు వచ్చాయి. గౌతమ్ గంభీర్‌కు "ఐసిస్ కశ్మీర్‌" నుంచి బెదిరింపులు వచ్చాయి. ఢిల్లీ పోలీసులను గంభీర్‌ సంప్రదించారు. తనను చంపేస్తామంటూ మెయిల్ వచ్చినట్లు గంభీర్ ఫిర్యాదు చేశారు. తనకు, తన కుటుంబ సభ్యులకు భద్రత కల్పించాల్సిందిగా పోలీసులను కోరారు. పహల్గాం ఉగ్రదాడిని ఎక్స్ మాధ్యమంలో గంభీర్ ఖండించిన కొన్ని గంటల్లోనే ఈ బెదిరింపులు వచ్చాయి. ఏప్రిల్​ 22న రెండు బెదిరింపు మెయిల్స్ వచ్చినట్లు గంభీర్ చెప్పాడు. ఈ నేపథ్యంలోనే కేసు నమోదు చేసిన సైబర్‌ సెల్ మెయిల్​లు ఎక్కడినుంచి వచ్చాయి? ఎవరు పంపారనే దానిపై విచారణ చేపట్టింది.

Tags:    

Similar News